కుటుంబకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుడు శోభన్‌బాబు. ముఖ్యంగా… అశేష మహిళా అభిమానగణం ఈ అందాల నటుడి సొంతం. అలాంటి… శోభన్‌బాబు వెండితెరపై తొలిగా సందడి చేసిన చిత్రం ‘దైవబలం’. మహానటుడు నందమూరి తారకరామారావు, జయశ్రీ నాయకానాయికలుగా నటించిన ఈ జానపద చిత్రంలో… గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, రమణారెడ్డి, ముక్కామల, వంగర, కస్తూరి శివరావు, గిరిజ, మాలతి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. పొన్నలూరి బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకి ఓ వైపు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తూనే… దర్శకత్వం కూడా వహించారు పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సముద్రాల, కొసరాజు, అనిశెట్టి, పరశురామ్ గీత రచయితలు కాగా… అశ్వత్థామ స్వరసారథ్యంలో రూపొందిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా “అందాల ఓ చందమామ”, “నిను వరియించి”, “ఏ తల్లి బిడ్డలను” వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1959 సెప్టెంబర్ 17న విడుదలైన ‘దైవబలం’… నేటితో 60 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. అంటే… నేటితో నటుడిగా శోభన్‌బాబు కూడా షష్టి పూర్తి చేసుకున్నారన్న మాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: