విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’

Vijay Deverakonda New Movie Titled As World Famous Lover,Vijay Deverakonda New Movie Title Revealed,World Famous Lover Movie Updates,World Famous Lover Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Hero Vijay Deverakonda Next Movie Titled As World Famous Lover,Actor Vijay Deverakonda Upcoming Movie Titled As World Famous Lover,#WorldFamousLover,#WFL

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో.. తాజాగా సినిమా టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ‘వరల్డ్ ఫెమస్ లవర్’ అనే ఓ డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ విజయ్ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంటోంది. మరి విజయ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

దీనితో పాటు ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఫైటర్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్… ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే… 2020 సమ్మర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =