కావేరి కాలింగ్ ఉద్యమానికి సంజన సపోర్ట్

Sanjjanaa Supports Cauvery Calling Campaign,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Cauvery Calling Campaign,Cauvery Calling,Sanjjanaa Supports Cauvery Calling,Tollywood Celebs Supports Cauvery Calling,Actors Supports Cauvery Calling

గోదావరి, మహానది తరువాత దక్షిణాది లో కావేరి నది 4వ పొడవైన నది. హరాంగి, హేమావతి, లక్ష్మణ తీర్ధ, అమరావతి, భవాని, కబిని , నోయల్ నదులు కావేరి నది కి ఉప నదులు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కావేరి నది పరీవాహక ప్రాంతాలు. కావేరి నది జలాల పరిరక్షణకు, పర్యావరణానికి సద్గురు అండ్ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావేరి కాలింగ్ పేరు తో ఉద్యమం ప్రారంభమయింది. కావేరి కాలింగ్ ఉద్యమం అంటే 242 కోట్ల మొక్కలు నాటడం, రైతులకు సపోర్ట్ చేయడం, భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల నటి సంజన గల్రాని కావేరి కాలింగ్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మొక్క ఖరీదు 42 రూపాయలని, ఎవరికి ఎంత అవకాశం ఉంటే అన్ని మొక్కలు డొనేట్ చేయమని, తాను లక్ష మొక్కలను డొనేట్ చేశానని, ఈ ఉద్యమానికి సపోర్ట్ గా అన్ని భాషల నటీనటులను ఆహ్వానిస్తున్నానని, మానవతా దృక్పథం తో ప్రతీ ఒక్కరు కావేరి కాలింగ్ ఉద్యమానికి మద్దతు నిమ్మని సంజన కోరారు. కర్ణాటక ప్రభుత్వం 2కోట్ల మొక్కలను డొనేట్ చేయడం విశేషం .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 12 =