‘మూడోకన్ను’ తెరవనున్న నయనతార

Nayanthara New Movie Netrikann First Look Poster Revealed,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Nayanthara New Movie Netrikann,Netrikann First Look Poster,Netrikann First Look,Nayanthara Netrikann First Look,Netrikann Movie Latest News

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గా నిన్ననే ప్రారంభించారు చిత్రయూనిట్. నిన్నటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న షూటింగ్ ను ప్రారంభించినా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసి ఒక పోస్టర్ ను విడుదల చేశారు ఈ రోజు. ఈ సినిమాకి ‘నెట్రికన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నెట్రికన్‌ అంటే మూడోకన్ను అని అర్థం. ఇంకా ఈ పోస్టర్లో బ్రెయిలీ లిపి కనిపిస్తోంది. అలాగే సంకెళ్లు .. కొరడా .. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటించనున్నట్టు తెలుస్తుంది. త్వరలో మిగతా వివరాలు తెలియజేయనున్నారు.

ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విఘ్నేశ్‌శివన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రౌడీ పిక్చర్స్‌ పేరు వెనుక కూడా ఓ కారణం ఉందట. విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం నానుమ్‌ రౌడీదాన్‌. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. చెవిటి యువతిగా నటించిన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. దానితో ఆ సినిమా సెంటిమెంట్ తో రౌడీ పిక్చర్స్‌ అని పెట్టాడట. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ తెచ్చిపెడుతుందో చూద్దాం..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − one =