కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 41

సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల ‘ఆనంద్’కు 15 ఏళ్ళు

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ముఖ్యంగా... శేఖర్ కెరీర్ ఆరంభంలో “మంచి కాఫీ లాంటి సినిమా” అంటూ వచ్చిన 'ఆనంద్' ... తదనంతర కాలంలో క్లాసిక్ మూవీగా నిలచింది. ఆనంద్ గా రాజా, రూప గా కమలినీ ముఖర్జీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించగా... సత్యా కృష్ణన్, అనీష్ కురువిల్ల, అనుజ్ గుర్వారా, మెల్కోటే, బేబీ భకిత ఫ్రాన్సిస్ ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యన్టీఆర్ చిత్రంలో 'ఛలో' బ్యూటీ?

యంగ్ టైగర్ యన్టీఆర్... ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పేట్రియాటిక్ డ్రామా... 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తార‌క్‌. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ డ్యాన్స్ బేస్డ్ మూవీ చేయనున్నాడు తారక్. ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తైన వెంటనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు కోసం దేవాదాయ‌శాఖ‌ను ట‌చ్ చేయ‌నున్న కొర‌టాల‌?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు... ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వేసవిలో అఖిల్ సందడి?

'సిసింద్రీ'(1995)గా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే ఘన విజయాన్ని అందుకున్న వైనం అక్కినేని అఖిల్ సొంతం. ఆ సినిమా విడుదలైన 20 ఏళ్ల తర్వాత 'అఖిల్'(2015)తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఆపై 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాలలో సందడి చేసిన అఖిల్... ఇప్పటివరకు 'సిసింద్రీ' స్థాయి విజయాన్ని నమోదు చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో... 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పైనే తన ఆశలను పెట్టుకున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్..?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన సైరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా దాదాపు 230 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు పండగ - ప్రైమ్ లో విజయ్ 'పోలీసోడు'

తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అందుకే తాను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక విజయ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రానుంది. ఈ సినిమా కోసం కూడా ఎప్పటిలాగే అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ ట్రాక్ లో పడినట్టేనా..!

విలన్ గా కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరో గా పలు హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ యాక్షన్ హీరోగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు గోపీచంద్. అయితే అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. పాపం గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన 'చాణక్య' కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది. కనీసం 5 కోట్ల షేర్ కూడా తెచ్చుకోలేకపోయింది. అంతేకాదు తమిళ దర్శకులను నమ్ముకొని దెబ్బతిన్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. చాణక్య ముందు వచ్చిన 'ఆక్సీజన్' సినిమాను కూడా…

TFN Adminవాట్సాప్
Blockbuster Arjun Reddy Combination To Repeat Again,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Arjun Reddy Combination To Repeat,Arjun Reddy Combo to Repeat Once Again,Blockbuster Arjun Reddy Combinat
సినిమా వార్తలు

'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ రిపీట్

'అర్జున్ రెడ్డి' ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ కు ఐకాన్ గా నిలిచి ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసాడు. ఈ సినిమా తర్వాత కాస్త తెలుగు సినిమా ఆలోచనా ధోరణి కాస్త మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత అటు విజయ్ దేవరకొండ.. ఇటు సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయింది. విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సందీప్ వంగా హిందీలోకి వెళ్ళాడు. అక్కడ కూడా అర్జున్ రెడ్డి రీమేక్ తీసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమాను లైన్ లో పెట్టాడు. 'కబీర్ సింగ్' తీసిన నిర్మాతలతోనే సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా చేయనున్నాడు…

TFN Adminవాట్సాప్
Raju Gari Gadhi Series To Continue Till 10 Parts,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raju Gari Gadhi Series,Raju Gari Gadhi Movie Series,Raju Gari Gadhi Series Upto 10 Parts
సినిమా వార్తలు

'రాజు గారి గది' 10 భాగాలా..?

యాంకర్ గా బుల్లి తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. ద‌ర్శకుడిగా తెరకెక్కించిన హార‌ర్ కామెడీ 'రాజుగారి గ‌ది'. 2015 లో వచ్చిన ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ ప్రధాన పాత్రలో ధనరాజ్, షకలక శంకర్, ధన్య కృష్ణ, విద్యుల్లేఖ, పూర్ణ, సప్తగిరి, పోసాని కృష్ణ మురళీ తదితరులు నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇక ఈ సినిమా హిట్ తో ఓంకార్ సీక్వెల్ ను 'రాజు గారి గది 2' పేరుతో తెరకెక్కించిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి 152 వ మూవీ కి డైలాగ్స్ సహకారం

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా సామజిక సందేశం నేపథ్యంలో చిరంజీవి 152 వ మూవీ రూపొందనుంది. శృతి హాసన్ కథానాయిక, ఇతర ముఖ్య పాత్రలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జెర్సీ మూవీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జెర్సీ మూవీ హిందీ లో రీమేక్ కానుంది. తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీ లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ జెర్సీ హిందీ వెర్షన్ కు హీరోగా ఎంపిక అయ్యారు. కబీర్ సింగ్ మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
సాంగ్

అల ... వైకుంఠపురములో .. బ్రహ్మానందం స్పెషల్ సాంగ్ ?

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా అల ... వైకుంఠపురములో ..మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ వాల్మీకి మూవీ లో అతిథి పాత్రలో నటించిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అల ... వైకుంఠపురములో .. మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Naga Shaurya New Movie Launched,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Shaurya New Movie,Naga Shaurya Upcoming Movie Details,Naga Shaurya Latest News 2019
సినిమా వార్తలు

నాగశౌర్య మరో కొత్త సినిమా ప్రారంభం

మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా అశ్వద్ధామ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తుండగా... పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తుండగా... మనోజ్‌రెడ్డి…

TFN Adminవాట్సాప్
ఖైదీ తెలుగు ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

ఖైదీ తెలుగు ట్రైలర్ రిలీజ్

హిట్స్ తో ప్లాప్స్ తో పనిలేకుండా మొదటి నుండి వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కార్తీ. ఇక ఇటీవల ఖాకీ సినిమాతో పర్వాలేదనిపించిన కార్తీ ఆ తరువాత చినబాబు - దేవ్ సినిమాతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక టీజర్ తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచిన చిత్రయూనిట్...రీసెంట్ గా ఆ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. తమిళ్ ట్రైలర్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చెయ్యగా.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక యాక్షన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్

కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార సైరా నరసింహా రెడ్డి వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ మూవీస్ తో బిజీగా ఉంటున్న నయనతార తెలుగు మూవీస్ ను సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్నారు. ఒక కొరియన్ మూవీ కి ఇంప్రెసయిన రానా దగ్గుబాటి ఆ మూవీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ కాప్ గా కనిపిస్తారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతి బ‌రిలో ‘వెంకీమామ’?

ఇద్దరు కథానాయకులు కలసి వెండితెరపై కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆ హీరోలిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్ళైతే డబుల్ బొనాంజా దక్కినట్టే. ఇప్పుడు ‘వెంకీమామ’తో అదే జరుగుతోంది. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో... పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నాయకానాయికలపై తెరకెక్కించిన పాటతో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని ‘పిల్ల జమీందార్’కు 8 ఏళ్ళు

“ఆనందం అనేది డబ్బులోనో, పబ్బుల్లోనో, కార్లలోనో లేదు... ఒక మనిషిలో మనిషిని చూడడంలోనే ఉందని” చాటి చెప్పిన చిత్రం ‘పిల్ల జమీందార్’. నేచురల్ స్టార్ నాని, హరిప్రియ జంటగా నటించిన ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో అవసరాల శ్రీనివాస్, బిందు మాధవి, రావురమేష్, ధన్‌రాజ్, ‘తాగుబోతు’ రమేష్, ఎం.ఎస్.నారాయణ, ‘వెన్నెల’ కిషోర్, నాగినీడు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కొరియన్ ఫిల్మ్ ‘ఎ మిలియనియర్స్ ఫస్ట్ లవ్” స్పూర్తితో ‘పిల్ల జమీందార్’ను తెరకెక్కించాడు దర్శకుడు జి.అశోక్. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌పై డి.ఎస్.రావు నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజికల్ హిట్... ‘క్రిమినల్’కు పాతికేళ్ళు

‘కింగ్’ నాగార్జున కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘క్రిమినల్’ ఒకటి. నాగ్‌కు జోడీగా మనీషా కోయిరాలా, రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, నాజర్, శరత్‌బాబు, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుధ, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ది ఫ్యుజిటివ్’(1993) స్ఫూర్తితో ‘క్రిమినల్’ను తెరకెక్కించాడు బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్.

Team TFNవాట్సాప్
Double Dhamaka for Superstar Rajinikanth Fans In 2020?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Double Dhamaka for Rajinikanth Fans,Superstar Rajinikanth Upcoming Movies 2020,Rajinikanth Latest News
సినిమా వార్తలు

2020లో రజినీ డ‌బుల్ ధ‌మాకా?

ఏడాదికో సినిమా లేదా రెండు మూడు సంవ‌త్స‌రాల‌కో సినిమాలో న‌టించే సూప‌ర్ స్టార్ రజినీకాంత్... 2018లో 'కాలా', '2.0' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది ‘పేట’తోనే సరిపెట్టిన సూపర్ స్టార్... 2020లో రెండు సినిమాల‌తో అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్నట్టు కోలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘96’ రీమేక్

పాత్రకు తగ్గట్టుగా తనని తాను మలచుకోవడం సమంత స్టైల్. అందుకే టాలీవుడ్, కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పలు విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇటీవల ‘ఓ బేబీ’తో మరో ఘనవిజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై బ్యూటీ... ప్రస్తుతం '96' రీమేక్‌లో నాయికగా నటిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తుండగా... ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్