నాగశౌర్య మరో కొత్త సినిమా ప్రారంభం

Naga Shaurya New Movie Launched,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Shaurya New Movie,Naga Shaurya Upcoming Movie Details,Naga Shaurya Latest News 2019

మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా అశ్వద్ధామ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తుండగా… పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తుండగా… మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశౌర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా.. అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =