గోపీచంద్ ట్రాక్ లో పడినట్టేనా..!

విలన్ గా కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరో గా పలు హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ యాక్షన్ హీరోగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు గోపీచంద్. అయితే అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. పాపం గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన ‘చాణక్య’ కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది. కనీసం 5 కోట్ల షేర్ కూడా తెచ్చుకోలేకపోయింది. అంతేకాదు తమిళ దర్శకులను నమ్ముకొని దెబ్బతిన్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. చాణక్య ముందు వచ్చిన ‘ఆక్సీజన్’ సినిమాను కూడా తమిళ దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించాడు. చాణక్య సినిమా తమిళ్ డైరెక్టర్ తిరు తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బోల్తాకొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాల ప్రభావంతో ఇప్పుడు గోపీచంద్ కు కాస్త రియలైజేషన్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో ఒకటి, సంపత్ నంది దర్శకత్వంలో మరొకటి. అయితే సంపత్ నంది సినిమాకు మాత్రం గోపీచంద్ కొన్ని మార్పులు చెప్పాడట. సంపత్ నంది భారీ బడ్జెట్ సినిమా అని ముందే చెప్పాడట గోపీచంద్ కి. అయితే ఇప్పడు బడ్జెట్ తగ్గించడమో లేక కథలో మార్పులు చేయడమో.. అది కూడా కాకపోతే ఈ కథను పక్కన పెట్టి వేరే కథతో ముందుకు వెళ్లాలని చూస్తున్నాడట. ఇదే విషయాన్నీ గోపీచంద్ సంపత్ కు కూడా చెప్పాడట. అంతే కాదు పూర్తిగా యాక్షన్ మాత్రమే కాకుండా.. కామెడీ కూడా ఉండేలా చూడాలని దర్శకులకు చెపుతున్నాడట గోపీచంద్..

మొత్తానికి ఇన్ని రోజులకి గోపీచంద్ కు జ్ఞానోదయం అయినట్టుంది. ఇప్పటికైనా మేల్కొని తన తప్పులు తెలుసుకున్నాడు. మరి ఇప్పటికైనా ట్రాక్ లోకి వచ్చినందుకైనా గోపీచంద్ కు ఓ మంచి హిట్ దక్కాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 17 =