హిట్స్ తో ప్లాప్స్ తో పనిలేకుండా మొదటి నుండి వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కార్తీ. ఇక ఇటీవల ఖాకీ సినిమాతో పర్వాలేదనిపించిన కార్తీ ఆ తరువాత చినబాబు – దేవ్ సినిమాతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక టీజర్ తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచిన చిత్రయూనిట్…రీసెంట్ గా ఆ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. తమిళ్ ట్రైలర్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చెయ్యగా.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక యాక్షన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాను ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా…. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి దీపావళికి సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్. అంతేకాదు 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే అని చెపుతున్నారు చిత్ర బృందం.
వీటితో పాటు కార్తి మరికొన్ని సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో రష్మికా మందన కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాపనాశం తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ. జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: