“ఆనందం అనేది డబ్బులోనో, పబ్బుల్లోనో, కార్లలోనో లేదు… ఒక మనిషిలో మనిషిని చూడడంలోనే ఉందని” చాటి చెప్పిన చిత్రం ‘పిల్ల జమీందార్’. నేచురల్ స్టార్ నాని, హరిప్రియ జంటగా నటించిన ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింలో అవసరాల శ్రీనివాస్, బిందు మాధవి, రావురమేష్, ధన్‌రాజ్, ‘తాగుబోతు’ రమేష్, ఎం.ఎస్.నారాయణ, ‘వెన్నెల’ కిషోర్, నాగినీడు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కొరియన్ ఫిల్మ్ ‘ఎ మిలియనియర్స్ ఫస్ట్ లవ్” స్పూర్తితో ‘పిల్ల జమీందార్’ను తెరకెక్కించాడు దర్శకుడు జి.అశోక్. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌పై డి.ఎస్.రావు నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి, మనుషుల్ని ప్రేమించడానికి సృష్టిస్తే… మనమే కన్ఫ్యూజ్ అయి… వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం”, “గెలుపుదేముందిరా మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది… ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది” వంటి డైలాగ్స్ హృదయానికి హత్తుకుంటాయి.
కృష్ణ చైతన్య, శ్రీమణి గీతరచన చేయగా… సెల్వగణేష్ బాణీలు అందించాడు. 2011 అక్టోబర్ 14న విడుదలై మంచి విజయం సాధించిన ‘పిల్ల జమీందార్’… నేటితో 8 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: