కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 32

సినిమా వార్తలు

రూమర్లా..? నిజమా..? క్లారిటీ ప్లీజ్

గతకొద్ది కాలంగా రాజకీయాల్లోనే ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ తో ఓకె చెప్పడంతో క్రిష్ కూడా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అంతేకాదు.. ఫోక్ జానర్ కి సంబంధించిన కథను పవన్ కోసం క్రిష్ సిద్ధంచేస్తున్నాడట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాకు భాష‌తో సంబంధం లేదు..!

నాకు భాష‌తో నాకు సంబంధం లేదు. న‌టించ‌డ‌మే నా పని అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. బాహుబలి, సాహో సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు . ఇక ఇటీవలే బాహుబలి ఘనత లండన్ లో వాసులు కూడా చూసారు. లండ‌న్‌లోని రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో బాహుబలి సినిమాను ప్రదర్శించగా.. అక్కడ కూడా బాహుబలి భళా అనిపించుకుంది. ఇక ఈ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌నకి నటులు అనుష్క, ప్రభాస్ ఇంకా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని ప్రభాస్ ను అడుగగా.. మంచి స్క్రిప్ట్ దొరికితే హాలీవుడ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ బిజీ హీరో

పెళ్ళి చూపులు మూవీ తో విజయం సాధించి , అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయంతో సెన్సేషనల్ హీరో గా మారి, బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు . ఇప్పుడు నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై మీకు మాత్రమే చెప్తా మూవీ ని నిర్మించారు . మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1వ వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు ఎస్పీ .రాజారామ్ మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సంతాపం

అక్టోబరు 24న మరణించిన ప్రముఖ దర్శకుడు ఎస్. పి.రాజారామ్ కు నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించింది. కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన" సమాజానికి సవాల్" చిత్రంతో దర్శకుడు గా కెరీర్ ప్రారంభించిన ఎస్ పి రాజా రామ్ తెలుగులో వదినగారి గాజులు, ముద్దాయి ముద్దుగుమ్మ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో ఘర్వాలి- బాహార్ వాలి, అభీ అభీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Team TFNవాట్సాప్
Khaidi Movie Box Office Collections, Khaidi Movie Collections, Khaidi movie latest collections, Khaidi Movie Worldwide Collections, Khaidi Telugu Movie Collections, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema
బాక్సాఫీస్

'ఖైదీ' టార్గెట్ 5 కోట్లు 5 రోజుల్లో వచ్చింది ఇది!

లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ తక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య కార్తీకి సరైన హిట్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా…

TFN Adminవాట్సాప్
KGF Chapter 1 About To Re Release In Bangalore,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,KGF Chapter 1 Movie Re Release in Bangalore,KGF Chapter 1 Movie Re Release Shows,KGF Movie Re Release Show Time
సినిమా వార్తలు

KGF చాప్టర్ 1 మూవీ రీ రిలీజ్

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన గ్యాంగ్ స్టర్ డ్రామా KGF చాప్టర్ 1 కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. 250 కోట్లు కలెక్ట్ చేసి శాండల్ వుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, , మలయాళ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు KGF చాప్టర్ 1 మూవీ కి సీక్వెల్ KGF చాప్టర్ 2 మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భాస్కర్ ఒక రాస్కల్ మూవీ నవంబర్ విడుదల

కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సిద్దిఖీ దర్శకత్వంలో అరవింద్ స్వామి, అమలాపాల్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ భాస్కర్ ఒక రాస్కల్ నవంబర్ లో రిలీజ్ కానుంది. భాస్కర ఒరు రాస్కల్ తమిళ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ భాస్కర్ ఒక రాస్కల్ మూవీ. నాజర్, నిఖిషా పటేల్, రోబో శంకర్, నైనిక ముఖ్య పాత్రలలో నటించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొరటాలతో సినిమా ఉంటుంది కానీ..!

సైరా సినిమా రిలీజ్ కాకముందు నుండే చిరు తరువాత సినిమా కొరటాల శివతో వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు మీదున్నాయి. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టి.. కంటిన్యూ మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసిన ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఏయన్నార్ ‘దొరబాబు’కు 45 ఏళ్ళు

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, దిగ్గ‌జ దర్శకుడు తాతినేని రామారావుది విజయవంతమైన జోడీ. వీరిద్దరి కలయికలో ప‌లు చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అటువంటి సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాల్లో ‘దొరబాబు’ ఒక‌టి. ఏయన్నార్‌కు జోడిగా మంజుల నటించగా... చంద్రకళ, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజబాబు, డి.రామానాయుడు తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
90 ML Movie Finishes It’s Shooting Schedule,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,90 ML Movie Shooting Schedule,90 ML Telugu Movie,Karthikeya New Movie 90 ML,Karthikeya Latest News 2019
షూటింగ్ అప్‌డేట్

90 ML మూవీ షూటింగ్ పూర్తి

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ 90ML మూవీ రూపొందుతుంది . యూత్ లో క్రేజ్ ఉన్న కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటిస్తున్న ఈ మూవీ లో రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. MBA గోల్డ్ మెడలిస్ట్ దేవదాసు ఆథరైజ్డ్ డ్రింకర్ గా మారడం ఈ మూవీ కాన్సెప్ట్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క‌మ‌ల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో విక్ర‌మ్‌?

‘మరుదనాయగం’... లోకనాయకుడు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్. రెండు దశాబ్దాలకు పూర్వమే కమల్ స్వీయదర్శకత్వంలో అట్ట‌హాసంగా ప్రారంభమైన ఈ హిస్టారిక‌ల్ డ్రామా... కొన్ని అనివార్య కారణాల వల్ల‌ మధ్యలోనే ఆగిపోయింది. క‌ట్ చేస్తే... ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెలుగులోకి వ‌చ్చింది. అంతేకాదు... ఇందులో ఓ టాలెంటెడ్ స్టార్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌నే ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాగచైతన్య "లవ్ స్టోరీ "

అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి లవ్ స్టోరీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ సంగీతం అందించారు. లవ్ స్టోరీ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

‘ఇద్దరి లోకం ఒకటే’ రిలీజ్ డేట్ మారిందా?

యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడీ చిత్రాన్ని డిసెంబర్ 25కి వాయిదా వేసే దిశ‌గా మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్న‌ట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హనీ ట్రాపర్‌గా `వింక్` బ్యూటీ?

ప్రియా ప్రకాష్ వారియర్... ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ... ప్ర‌స్తుతం యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ సినిమాలో నాయిక‌గా న‌టిస్తోంది. తెలుగులో త‌న‌కిదే తొలి చిత్రం కావ‌డం విశేషం. అంతేకాదు... ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో క‌నిపించ‌నుంద‌ట‌ ప్రియ.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సౌదీ అరేబియాకు వెళుతున్న‌ అఖిల్ ?

అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్టు సమాచారం. అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో పాటు కుటుంబ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా... గోపిసుందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డబుల్ సెంచరీ కొట్టిన 'విజిల్'

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 8.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించబోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మలయాళం మూవీ రీమేక్ లో ..?

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు సుమంత్. ‘మళ్లీరావా’ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చిన సుమంత్ ఆ తర్వాత వచ్చిన ‘ఇదంజగత్’ 'సుబ్రహ్మణ్యపురం' సినిమాలు తీసినా అవి సరిగా విజయం దక్కించుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈ సారి రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమ్ముడి డైరెక్టర్ కు అన్న గ్రీన్ సిగ్నల్

లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ గా నిలిచింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు కత్తి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అన్న ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక కలెక్షన్స్ కూడా మంచిగానే రాబడుతుంది.

TFN Adminవాట్సాప్
Khaidi Movie Success Meet Highlights,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi Movie Success Meet,Khaidi Success Meet Highlights,Karthi Khaidi Movie Success Meet
సినిమా వార్తలు

ఖైదీ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది - కార్తి

'మా న‌గ‌రం' ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షకాదరణతో ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణతో ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌…

TFN Adminవాట్సాప్
Ram Red Movie Release Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Red Movie Release Date,Red Telugu Movie Release Date,Ram Pothineni Red Movie,Red Movie Updates
రిలీజ్ అప్‌డేట్

రామ్ #RED - రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మొన్న రిలీజ్ చేయగా.. ఈ రోజు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నవంబర్ 16వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్