దర్శకుడు ఎస్పీ .రాజారామ్ మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సంతాపం

అక్టోబరు 24న మరణించిన ప్రముఖ దర్శకుడు ఎస్. పి.రాజారామ్ కు నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించింది. కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన” సమాజానికి సవాల్” చిత్రంతో దర్శకుడు గా కెరీర్ ప్రారంభించిన ఎస్ పి రాజా రామ్ తెలుగులో వదినగారి గాజులు, ముద్దాయి ముద్దుగుమ్మ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో ఘర్వాలి- బాహార్ వాలి, అభీ అభీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చలనచిత్ర దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ ” సౌమ్యులు, సహృదయులు అయిన ఎస్పీ రాజారామ్ గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక సీనియర్ సిన్సియర్ డైరెక్టర్ ను కోల్పోయింది. ఆయన మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం పక్షాన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తున్నాం “- అన్నారు. ఈ సంతాప సభలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి చెందిన పలువురు సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =