నాకు భాషతో నాకు సంబంధం లేదు. నటించడమే నా పని అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. బాహుబలి, సాహో సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు . ఇక ఇటీవలే బాహుబలి ఘనత లండన్ లో వాసులు కూడా చూసారు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి సినిమాను ప్రదర్శించగా.. అక్కడ కూడా బాహుబలి భళా అనిపించుకుంది. ఇక ఈ ప్రత్యేక ప్రదర్శనకి నటులు అనుష్క, ప్రభాస్ ఇంకా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని ప్రభాస్ ను అడుగగా.. మంచి స్క్రిప్ట్ దొరికితే హాలీవుడ్ సినిమాలలో నటించేందుకు ఎల్లప్పుడు రెడీ.. భాషతో నాకు సంబంధం లేదు… నటించడమే నా పని అని తెలిపాడు. మరి ప్రభాస్ కు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. అంతేకాదు… హైదరాబాద్‌లో జరుగనున్న ఈ షెడ్యూల్‌కి సంబంధించి ప్రస్తుతం ఓ భారీ సెట్ కూడా తీర్చిదిద్దుతున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































