
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 88


మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి?

118 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

RRR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

నాని జెర్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సీత రిలీజ్ డేట్ ఫిక్స్

కార్తికేయ సీక్వెల్ కన్ఫామ్!

మరో రికార్డ్ క్రియేట్ చేసిన ఎఫ్2

కథనం టీజర్ రిలీజ్

ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ యాక్ట్రెస్?

అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ప్రారంభం ఆ రోజేనా ?

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న అజయ్ భూపతి

మరోసారి `అర్జున్ రెడ్డి` జోడీ?

తెలంగాణ లో శేఖర్ కమ్ముల మూవీ షూటింగ్

మెగాస్టార్ చిత్రంలో శ్రుతి హాసన్?

ప్రేమ కథా చిత్రమ్ 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

కెప్టెన్ మార్వెల్ మూవీ మౌత్ టాక్

బాలీవుడ్ స్టార్ తో రానా జాయింట్ ప్రొడక్షన్!
రానా దగ్గుబాటి, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కలిసి ఓ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ను స్టార్ట్ చేయనున్నట్టు గత మూడేళ్ల క్రితమే చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఈ మూడేళ్లలో దీనిపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ మళ్లీ ఇప్పుడు ఈ వార్త తెరపైకి వచ్చింది.

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి?
సాయిపల్లవి... జయాపజయాలకు అతీతంగా తనకంటూ ఓ అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ తరం కథానాయిక. స్క్రిప్ట్, క్యారెక్టర్ నచ్చితేనే... సినిమాలకు సంతకం చేసే ఈ డాన్సింగ్ సెన్సేషన్... తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

118 ఫస్ట్ వీక్ కలెక్షన్స్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా.. నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 118. .ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైన సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక పోటీకి ఏ సినిమాలు కూడా లేవు కాబట్టి కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

RRR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
ప్రపంచ విఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. RRR మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో నవంబర్ లో జరిగింది. సెకండ్ షెడ్యూల్ జనవరిలో జరిగింది. 45రోజులపాటు కోల్ కత్తా షూటింగ్ షెడ్యూల్ లో హీరోల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

నాని జెర్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా 1996 వ సంవత్సరం రంజీ ట్రోఫీ క్రికెట్ నేపథ్యం లో రూపొందిన జెర్సీ మూవీ ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. క్రికెటర్ అర్జున్ గా నాని నటిస్తున్న జెర్సీ మూవీ లో శ్రద్ధా శ్రీనాధ్ కథా నాయిక. సత్యరాజ్, రోనిత్ శర్మ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

సీత రిలీజ్ డేట్ ఫిక్స్
కవచం సినిమాలో సందడి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ మరోసారి సీత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్..ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి షాకిచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.

కార్తికేయ సీక్వెల్ కన్ఫామ్!
చందు మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ అందరికీ నచ్చేసి నిఖిల్ కు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను తీయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. గతంలో నిఖిల్ కూడా ఈ సీక్వెల్ గురించి చెప్పాడు కానీ ఆ తరువాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు.

మరో రికార్డ్ క్రియేట్ చేసిన ఎఫ్2
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సంక్రాంతి బరిలో దిగి విన్నర్ గా నిలిచి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకొన్నప్పటికీ కలెక్షన్స్ ఎక్కడా వెనకపడకుండా కుమ్మేస్తోంది. ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్..రూ.80 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది.

కథనం టీజర్ రిలీజ్
క్షణం సినిమాతో సీరియస్ నటిగా గుర్తింపు తెచ్చుకొని... ఆ తర్వాత రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది అనసూయ. మంచి పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకొని ఇప్పుడు ప్రధాన పాత్రలు చేసే స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పుడు కథనం సినిమాతో మరోసారి తన సత్తా చూపించడానికి వచ్చేస్తుంది.

ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ యాక్ట్రెస్?
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా మరి కొద్ది రోజుల్లో మూడో షెడ్యూల్లో పాల్గొననుంది. దాదాపు 40 రోజుల పాటు కోల్ కతాలో షూటింగ్ జరగనుండగా.. ఈ షూటింగ్ లో ఈసారి ఇద్దరు హీరోలూ పాల్గొననున్నారు.

సినిమా రంగంలో మహిళా విజయం ( మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
" ముదితల్ నేర్వగరాని విద్యను గలవే ముద్దార నేర్పించినన్" అంటాడు భర్తృహరి. నిజంగానే ప్రేమ మీరగా నేర్పిస్తే ఆడవాళ్లకు అబ్బని విద్యగాని, అందుకోలేని విజయంగాని ఏదీ లేదు. విద్యా,వైద్య, వ్యాపార, రాజకీయ, శాస్త్ర, వైజ్ఞానిక, క్రీడా, కళాది రంగాలలో స్త్రీలు సాధించిన విజయాలు, వారు నెలకొల్పిన రికార్డులు మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. నరకాసుర వధలో సత్యభామ సాహసం, స్వతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, స్వతంత్ర భారతంలో ఇందిరాగాంధీ చాతుర్యం ఇవన్నీ మహిళా విజయానికి ప్రతీకలుగా నిలిచే విశేషాలు.

అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ప్రారంభం ఆ రోజేనా ?
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, S/O సత్యమూర్తి మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ హిట్ కాంబినేషన్ లో మూడవసారి ఈ మూవీ రూపుదిద్దుకోనుంది.

`చిత్రలహరి` కోసం డబ్బింగ్ చెప్పుకోనున్న కళ్యాణి ప్రియదర్శన్?
`హలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న కళ్యాణి... ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రెండు తెలుగు చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం... ఇలా మొత్తం ఐదు సినిమాలతో కళ్యాణి బిజీగా ఉందిప్పుడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న అజయ్ భూపతి
ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతికి మరియు హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కు కూడా మంచి క్రేజ్ రావడంతో పాటు ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ఇప్పటికే హీరో,హీరోయిన్స్ పలు ప్రాజెక్టులలో బిజీ కాగా దర్శకుడు అజయ్ ఓ భారీ చిత్రం కమిటైనట్టు తెలుస్తోంది.

మరోసారి `అర్జున్ రెడ్డి` జోడీ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌ని కీలక మలుపు తిప్పిన చిత్రం `అర్జున్ రెడ్డి` (2017). ఆ సినిమాతోనే తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది షాలినీ పాండే. అర్జున్ రెడ్డి, ప్రీతి పాత్రల్లో విజయ్, షాలిని జంట యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. మళ్ళీ రెండేళ్ళ తరువాత ఈ జోడీ మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతోందట.

వేసవిలో క్యూ కడుతున్న ఆసక్తికరమైన చిత్రాలు
ఎప్పటిలాగే ఈ ఏడాదిలో కూడా వేసవి బరిలో ఆసక్తికరమైన సినిమాలు సందడి చేయనున్నాయి. మార్చి ద్వితీయార్ధంతో మొదలై జూన్ ప్రథమార్ధంతో ముగిసే ఈ సీజన్‌లో... దాదాపు ప్రతీ వారం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 5న యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా నటించిన `మజిలీ` విడుదల కానుండగా... 12న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్న `చిత్ర లహరి` తెరపైకి రానుంది. ఇక అదే నెల 19న నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా…

తెలంగాణ లో శేఖర్ కమ్ముల మూవీ షూటింగ్
నేషనల్ అవార్డు విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫిదా మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రం లోని బాన్సువాడ లో జరిగింది. పల్లెటూరు వాతావరణం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గోదావరి జిల్లాలలో షూటింగ్స్ జరిగేవి. తెలంగాణ లో కూడా పల్లెటూర్లు అందంగా ఉంటాయని శేఖర్ కమ్ముల ఫిదా మూవీ ద్వారా తెలియజేశారు.

మెగాస్టార్ చిత్రంలో శ్రుతి హాసన్?
మెగా కాంపౌండ్ హీరోలకు కలిసొచ్చిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `గబ్బర్ సింగ్`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో `రేసు గుర్రం`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో `ఎవడు` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రుతి... ఆ యా చిత్రాలతో మంచి విజయాలను నమోదు చేసుకుంది. అయితే... పవన్ కళ్యాణ్‌తోనే మరోసారి కలసి నటించిన `కాటమ రాయుడు` మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తరువాత మళ్ళీ తెలుగులో నటించని శ్రుతి... దాదాపు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరో మెగా మూవీతోనే తెలుగునాట రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాలీవుడ్ టాక్.

ప్రేమ కథా చిత్రమ్ 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
మారుతి దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఒకపక్క భయపెడుతూనే... మరోపక్క నవ్విస్తూ.. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేశారు. ఇప్పుడు ప్రేమకథా చిత్రమ్ -2 బ్యాక్ టు ఫియర్ అనే క్యాప్షన్ తో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కెప్టెన్ మార్వెల్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.