అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సంక్రాంతి బరిలో దిగి విన్నర్ గా నిలిచి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకొన్నప్పటికీ కలెక్షన్స్ ఎక్కడా వెనకపడకుండా కుమ్మేస్తోంది. ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్..రూ.80 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పటికీ కలెక్షన్లకు మాత్రం నష్టం రాలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది ఎఫ్2. నైజాం ఏరియాలో తెలుగు సినిమాల ప్రదర్శనకు కేంద్ర బిందువైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ఈ సినిమా 54 రోజుల్లో రూ. 1 కోటి 20వేలు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మొత్తానికి ఎఫ్ 2 రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ తో అటు వెంకీ తో పాటు హీరోయిన్లుగా కాస్త వెనకపడిపోయిన తమన్నా, మెహ్రీన్ కూడా మరింత ముందుకు దూసుకెళ్లారు. ఇక అనిల్ రావిపూడికి అయితే ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కింది. మరి ఎఫ్ 2 సక్సెస్ తో దాని సీక్వెల్ కూడా తెరకెక్కించనున్నారు. మరి చూద్దాం ఈ సీక్వెల్ తో ఎంత నవ్విస్తారో..
[youtube_video videoid=6KqMKsyKD6A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: