రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా మరి కొద్ది రోజుల్లో మూడో షెడ్యూల్లో పాల్గొననుంది. దాదాపు 40 రోజుల పాటు కోల్ కతాలో షూటింగ్ జరగనుండగా.. ఈ షూటింగ్ లో ఈసారి ఇద్దరు హీరోలూ పాల్గొననున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇప్పటికే ఈ సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రాగా ఇప్పుడు మరో కొత్త న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఓ ఫారిన్ యాక్ట్రెస్ ను తీసుకోనున్నారట. ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరుగుతున్నాయట. సదరు యాక్ట్రెస్ కాస్త ఎక్కువనే డిమాండ్ చేస్తుందట. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ కనుక రాజమౌళి ఇవ్వడానికి ఓకే అయితే ఆమె సైన్ చేయడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ నటి అలియా భట్ నటించే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం.. ఆఖరికి వీరిద్దరి పక్కన నటించే లక్కీ ఛాన్స్ ఏ హీరోయిన్స్ కు దక్కుతుందో.
కాగా దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: