
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 43


దివికెగసిన మరో సినీ కెరటం
మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మెహరీన్
విజయ్‌తో కలసి నాలుగోసారి నటించనున్న సామ్?
`సరిలేరు నీకెవ్వరు` రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్
స్పానిష్ థ్రిల్లర్ రీమేక్‌లో అనుష్క?
వరుణ్ తేజ్ `వాల్మీకి`కి రిలీజ్ డేట్ ఫిక్స్
రౌడీ హీరో మౌనం వెనుక అంతరార్ధం ఏమిటో..?
ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అంతే..!
నేను అప్పుడు రిటైర్ అవుతా
'ఫస్ట్ ర్యాంక్ రాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

వావ్ డైట్ వర్కవుట్ అయిందే..!
గోపిచంద్ సినిమాకు బాలకృష్ణ టైటిల్
‘మన్మథుడు 2’ టీజర్ ఎప్పుడంటే...

"ఐ లవ్ యు" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రాజ్ దూత్' టీజర్ రిలీజ్

నటసింహం 'బాలకృష్ణ'కు పుట్టినరోజు శుభాకాంక్షలు
నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటనను వారసత్వంగా అందిపుచ్చుకొని.. తెలుగు సినీ పరిశ్రమలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని..టాప్ 4 అగ్ర హీరోల జాబితాలో నిలిచిన నటుడు నందమూరి బాలకృష్ణ. ఈ రోజు బాలకృష్ణ తన 58 వసంతాలు పూర్తి చేసుకొని 59వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు బాలకృష్ణ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు...
లండన్ ఓవల్ మైదానంలో "మహర్షి" కేరింతలు
“మహర్షి” సాధించిన అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా , కుమారుడు గౌతం, కుమార్తె సితార హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా సతీ సమేతంగా యూరోపియన్ కంట్రీస్ లో పర్యటిస్తున్నారు. అయితే అందరూ కలిసి మహర్షి సక్సెస్ ను మరింతగ సెలబ్రేట్ చేసుకునేందుకు మంచి వేడుక- వేదిక ఏది? అని ఆలోచించి చివరకు లండన్ లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 9న జరగనున్న వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ సందర్భంగా అందరూ కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. ఆరోజున మహేష్ బాబు తన ఫ్యామిలీతో లండన్ చేరుకోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తోపాటు నిర్మాత దిల్ రాజు,మ్యాంగో గ్రూప్…

దివికెగసిన మరో సినీ కెరటం
ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన సినీ పరిశ్రమ ఇప్పుడు దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ మరో గొప్ప రచయిత మరియు నటుడిని కోల్పోయింది. ఆయనే గిరీష్ కర్నాడ్. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ ఈరోజు బెంగళూరులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మెహరీన్
`కృష్ణగాడి వీరప్రేమగాథ` వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది మెహరీన్ కౌర్ పిర్జాడ. ఆ తర్వాత `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్`తో వరుస విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ పంజాబీ భామ... ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్‌కు జంటగా ‘చాణక్య’లో నటిస్తోంది. అలాగే... యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘అశ్వథ్థామ’ (ప్రచారంలో ఉన్న పేరు)లోనూ హీరోయిన్‌గా దర్శనమివ్వనుంది. వీటితో పాటు మరో మూడు సినిమాల్లో మెహరీన్ కథానాయికగా నటించబోతున్నట్లు టాక్. అయితే…
విజయ్‌తో కలసి నాలుగోసారి నటించనున్న సామ్?
సమంత... టాలీవుడ్, కోలీవుడ్‌లలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక. అంతేకాదు... ఈ రెండు భాషల్లోనూ ఆల్‌మోస్ట్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారి కెరీర్ బెస్ట్ హిట్స్‌లో కూడా భాగస్వామి అయిన నాయిక. అయితే... వీరిలో కొంతమందితో రిపీటెడ్‌గా రెండు లేక మూడు చిత్రాలు చేసిన సామ్... యువ సామ్రాట్ నాగ చైతన్యతోనూ(‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’), యంగ్ టైగర్ యన్టీఆర్‌తోనూ(‘బృందావనం’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’, ‘జనతా గ్యారేజ్’) అత్యధికంగా నాలుగేసి చిత్రాలలో కలసి నటించడం విశేషం. ఇంతవరకు టాలీవుడ్ హీరోలతో నాలుగేసి చిత్రాలు చేసిన ఈ చెన్నై బ్యూటీ…
`సరిలేరు నీకెవ్వరు` రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్ నుంచి రాగానే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీ కానున్నాడు. మిలటరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1 నుంచి జమ్మూ, కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను జరుపుకోనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా... మహేష్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారట.
స్పానిష్ థ్రిల్లర్ రీమేక్‌లో అనుష్క?
‘అరుంధతి’, ‘పంచాక్షరి’, `వర్ణ`, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తర్వాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే పేరుతో విడుదల కానున్న ఈ చిత్రం... ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే... ఓ స్పానిష్ థ్రిల్లర్ మూవీ రీమేక్‌లో నటించడానికి…
వరుణ్ తేజ్ `వాల్మీకి`కి రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు.
రౌడీ హీరో మౌనం వెనుక అంతరార్ధం ఏమిటో..?
విజయ్ దేవరకొండ.. ప్రస్తుత జనరేషన్ కి యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు. అదృష్టం వస్తే ఎవరూ ఆపలేరన్నట్టుగా.. ఈ హీరోకి అదృష్టంపాళ్లు కాస్త ఎక్కువే. అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉందనుకోండి. టాలెంట్ కు అదృష్టం తోడైంది కాబట్టే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్నాడు. లేకపోతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. పెళ్లి చూపులు లాంటి చిన్నసినిమాతో పెద్ద హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డితో నయా ట్రెండ్ క్రియేట్ చేయడంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని.. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరయి.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. విజయ్ తో పెద్ద డైరెక్టర్లు సైతం సినిమాలు…
ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అంతే..!
ఎన్ని కోట్ల పెట్టి సినిమాలు తీసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా అవి ప్రేక్షకులకు చూపెట్టడానికే. ఇక ప్రేక్షకుడికి సినిమా నచ్చిందా.. నెత్తినపెట్టుకొని చూస్తారు... సినిమా బాలేదా.. ఎలాంటి మొహమాటం లేకుండా సినిమాను పాతాళానికి తొక్కేస్తారు. అందుకే ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ప్రేక్షక దేవుళ్లు అని సంబోధిస్తారు. ఇక అభిమాలు కూడా తమ అభిమాన హీరోపై కానీ.. హీరోయిన్ పై కానీ ఎంత ప్రేమ చూపిస్తారో.. అది వెలకట్టలేనిది అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.
నేను అప్పుడు రిటైర్ అవుతా
తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది తాప్సీ. తెలుగులో సినిమాల సంఖ్య తగ్గినా.. హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అక్కడ ఈ భామ తీసిన సినిమాలు కాస్త హిట్ అవుతుండటంతో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. బద్లా సినిమాతో మరోసారి నటిగా సత్తా చూపించింది. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీ అయిపోయింది తాప్సీ.
'ఫస్ట్ ర్యాంక్ రాజు' రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

వావ్ డైట్ వర్కవుట్ అయిందే..!
'వెన్నెల' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్స్ తో కామెడీ పంచుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తాను నటించిన హిప్పీ సినిమా కూడా ఇటీవలే రిలీజైంది. ఈసినిమాలో కూడా వెన్నెలకిషోర్ కామెడీకి మంచి గుర్తింపు వచ్చింది.
గోపిచంద్ సినిమాకు బాలకృష్ణ టైటిల్
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గత కొద్ది కాలంగా ఇండో పాక్ బోర్డర్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా గోపీచంద్ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే.. హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరిస్తున్నారట.
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ నటించిన `రాజ్ ధూత్` టీజర్ ఆవిష్కరణ
స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎఫ్.ఎన్.సీ.సీ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన జీవితారాజశేఖర్ టీజర్ ఆవిష్కరించారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో శ్రియ ఫీమేల్ సెంట్రిక్ మూవీ
శ్రియా శరన్... నిన్నటి తరం అగ్ర కథానాయిక. అందానికి చిరునామాగా నిలచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... పలు చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కూడా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా, ఇప్పుడు మరోసారి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనుంది శ్రియ.
‘మన్మథుడు 2’ టీజర్ ఎప్పుడంటే...
కింగ్ నాగార్జున క్లాసిక్ హిట్ `మన్మథుడు`కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ సరికొత్త పాత్ర?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ... ఈ నెల (జూన్) 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని మహేష్ పాత్ర తీరు తెన్నులకు సంబంధించి పలు కథనాలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

"ఐ లవ్ యు" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకూ చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్ తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.

'రాజ్ దూత్' టీజర్ రిలీజ్
విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే నటుడు రియల్ స్టార్ శ్రీహరి. యాక్షన్ అయినా...సెంటిమెంట్ అయినా... పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తాడు. ఇక కామెడీ గురించి అయితే చెప్పనక్కర్లేదు... తెలంగాణ యాసలో మాట్లాడుతూ శ్రీహరి చేసే కామెడీకైతే పొట్ట చెక్కలవ్వాల్సిందే. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీహరి గత కొద్ది సంవత్సరాల క్రితమే అకాల మరణం చెందారు.