మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం హైదరాబాద్‌లో మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ క్రేజీ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా కథానాయిక పూజా హెగ్డే మినహా మిగిలిన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉందట చిత్ర బృందం. పూజ వేరే సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల… జూలై నుంచి ‘వాల్మీకి’ చిత్రీకరణలో పాల్గొంటుందని టాక్. కాగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

[youtube_video videoid=t-SWlHFaFUk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























