
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 42


ఒక షెడ్యూల్ మినహా ‘మన్మథుడు 2’ పూర్తి

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఖరారు

మన్మథుడు 2 టీజర్ కు ముహూర్తం ఖరారు

వరుణ్ తేజ్ కు జోడీగా తెలుగమ్మాయి

కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్
శ్రీదేవి బయోపిక్ మూవీ లో నటించాలని ఉంది -తమన్నా

అప్పుడు 'నువ్వు నేను ప్రేమ' ఇప్పుడు 'హిప్పీ'

సన్నీ లియోన్ తో స్టార్ కమెడియన్స్..!

థ్రిల్లింగ్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామా

మరోసారి వెంకీ, టబు జోడీ?
స్పెయిన్ వెళుతున్న కీర్తి సురేష్

మరోసారి హారర్ మూవీలో సమంత?
"క్రాంతి" గా బాలకృష్ణ?

సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్ మృతి
యాక్షన్ బిగిన్స్ - సాహో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో స్పెషల్ సాంగ్‌లో కాజల్ అగర్వాల్?
యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలచిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఆ సినిమాలో “నేను పక్కా లోకల్” అనే స్పెషల్ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి కారణం... టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తొలిసారి ప్రత్యేక గీతంలో నర్తించిన కాజల్... ధియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కట్ చేస్తే... మూడేళ్ళ తరువాత మరోసారి తన స్టెప్స్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతోందట ఈ భామ.

‘సిసింద్రీ’ తర్వాత మరోసారి అఖిల్‌కి అమ్మగా ఆమని?
“చిన్ని తండ్రి నిను చూడగా... వేయి కళ్ళైనా సరిపోవురా”... అంటూ ‘సిసింద్రీ’ (1995)లో ఆమని, అఖిల్‌పై చిత్రీకరించిన ఈ పాట ఎప్పటికీ అజరామరమే. ఊహ తెలియని వయసులోనే ‘సిసింద్రీ’తో క్యూట్ హిట్‌ను తన సొంతం చేసుకున్నాడు అఖిల్. హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే అవుట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... తల్లీకొడుకులుగా ఆమని, అఖిల్ ప్రేక్షకులను కట్టిపడేశారు. కట్ చేస్తే... దాదాపు 24 ఏళ్ళ తరువాత మరోసారి తల్లీకొడుకులుగా దర్శనమివ్వనున్నారట ఆమని, అఖిల్.

ఒక షెడ్యూల్ మినహా ‘మన్మథుడు 2’ పూర్తి
“అమ్మాయి లార్డ్‌లా కూర్చుంటే... మనం కూలోడి లాగా వంగి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ముళ్ళు వెయ్యాలి. ఇక్కడినుంచే బెండింగ్ స్టార్ట్ అయిపోయింది బ్రదరూ” అంటూ అమ్మాయిల విషయంలో, పెళ్లి విషయంలో యువకులను జాగృతం చేసిన ‘మన్మథుడు’ అభిరామ్‌ను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా కొత్త కాన్సెప్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నాడు ‘మన్మథుడు 2’.

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఖరారు
జి.ఎస్.కార్తిక్ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

ఆస్ట్రియాకు సాహో టీమ్
సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సాహో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. చాలా వరకూ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోగా.. పాటలు పెండింగ్ లో ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో ఓ సాంగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ టీమ్.. ఇప్పుడు మరో పాటను చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే ఈ పాట కోసం సాహో టీమ్ ఆస్ట్రియాకు వెళ్లనుంది. అక్కడ ప్రభాస్, శ్రద్ధా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారట. అంతేకాదు కొన్ని సన్నివేశాలు కూడా షూట్…

మన్మథుడు 2 టీజర్ కు ముహూర్తం ఖరారు
2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

వరుణ్ తేజ్ కు జోడీగా తెలుగమ్మాయి
హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మూవీ జిగర్తాండ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 6వ తేదీన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొంత మంది హీరోయిన్లకు మాత్రం వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తుంది అందాల భామ మెహ్రీన్. ఈ భామకు సరైన హిట్లు లేకపోయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈ భామకు ఎఫ్ 2 తో మంచి హిట్ దక్కింది. దీంతో 'ఎఫ్ 2' సినిమా సూపర్ హిట్ కావడంతో మరింత బిజీగా తయారైంది మెహ్రీన్. తనకు వచ్చిన అవకాశాల్లో నుంచి తనకి నచ్చినవాటికి మాత్రమే సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.
శ్రీదేవి బయోపిక్ మూవీ లో నటించాలని ఉంది -తమన్నా
తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలలో నటిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమన్నా దివంగత లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కి పెద్ద అభిమాని. శ్రీదేవి బయోపిక్ మూవీ లో శ్రీదేవిగా నటించాలనే కోరిక ను తమన్నా వెల్లడించారు.

అప్పుడు 'నువ్వు నేను ప్రేమ' ఇప్పుడు 'హిప్పీ'
టీఎన్ కృష్ణ దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా 'హిప్పీ'. ఇటీవలే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే యూత్ కి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చిందని చెప్పొచ్చు. అయితే విమర్శకుల నుండి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయనుకోండి అది వేరే సంగతి.

సన్నీ లియోన్ తో స్టార్ కమెడియన్స్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం చేసిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తన హావభావాలతోనే నవ్వు పుట్టించగల మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ కమెడియన్. ఇప్పుడొచ్చే ఎంతో మంది కమెడియన్స్ కు ఆయన స్పూర్తి.. ఇక బ్రహ్మీ తరవాత వచ్చిన జనరేషన్ లో అంత మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ సునీల్. గోదావరి యాసతో.. పంచ్ డైలాగ్స్ తో.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తను కూడా తన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు.

థ్రిల్లింగ్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామా
భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ నేపథ్యం లో పలు మూవీస్ రూపొందుతున్నాయి. టాలీవుడ్ లో నాని "జెర్సీ ", నాగచైతన్య "మజిలీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి ఒక స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు. ఈమూవీ పలు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కనుందని సమాచారం.

మరోసారి వెంకీ, టబు జోడీ?
కలయా నిజమా... తొలి రేయి హాయి మహిమా`, `కొత్త కొత్తగా ఉన్నది`... అంటూ రొమాంటిక్ పెయిర్‌గా వెంకటేష్, టబు డ్యూయెట్లు పాడుకున్న చిత్రం ‘కూలీ నంబర్ 1’(1991). మ్యూజికల్ హిట్‌గా నిలచిన ఈ సినిమాతోనే టబు కథానాయికగా తొలి అడుగులు వేసింది. కట్ చేస్తే... 28 ఏళ్ళ తర్వాత ఈ జంట మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ టాక్.

మరోసారి జట్టుకట్టనున్న మహేష్, వంశీ పైడిపల్లి?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’... ఈ ఏడాది వేసవి సందర్భంగా మే 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు... తాజాగా వంద కోట్ల షేర్ క్లబ్‌లో కూడా చేరిపోయింది. ఈ నేపథ్యంలో... మహేష్, వంశీ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
స్పెయిన్ వెళుతున్న కీర్తి సురేష్
గత ఏడాది ‘మహానటి’గా అలరించిన కేరళకుట్టి కీర్తి సురేష్... ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తూ బిజీగా ఉంది. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.

మరోసారి హారర్ మూవీలో సమంత?
ఆ మధ్య `రాజుగారి గది 2` అనే హారర్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన టాలెంటెడ్ బ్యూటీ సమంత... ఇప్పుడు మరో హారర్ మూవీలో నటించబోతోందట. అయితే, ఈ సారి టాలీవుడ్‌లో కాదు, కోలీవుడ్‌లో ఈ తరహా చిత్రం చేయనుందట సామ్.
"క్రాంతి" గా బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి ‘క్రాంతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో బాలకృష్ణ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడట. అంతేకాదు... ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ నేమ్ కూడా క్రాంతి అని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘క్రాంతి’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ప్రముఖంగా వినిపించింది. అయితే... ఇప్పుడు ‘క్రాంతి’…

సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్ మృతి
ఇప్పటికే నటుడు, దర్శకుడు, రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ వంటి ఓ గొప్ప వ్యక్తిని సినీ పరిశ్రమ కోల్పోగా.. ఇప్పుడు మరో ప్రముఖ సీనియర్ కమెడియన్ కూడా ఈరోజే తుది శ్వాస విడిచారు. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమవారం) మృతి చెందారు. సడెన్ గా గుండెపోటు వచ్చిన ఆయన్ని కావేరి హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
యాక్షన్ బిగిన్స్ - సాహో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్ అభిమానులకు సాహో చిత్రయూనిట్ ఓ గుడ్ న్యూస్ ఇచ్చింది. సాహో నుండి షేడ్స్ ఆఫ్ సాహో పేరిట మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడమే తప్పా అంతకు మించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు ఇప్పటివరకూ సాహో టీమ్. దీంతో టీజర్, ట్రైలర్ల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఊరటనిస్తూ.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ నెల 13 (జూన్ 13)వ తేదీన సాహో టీజర్ ను రిలీజ్ చేయనునున్నట్టు యూపీ క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన ఇచ్చారు. జూన్ 14న థియేటర్లలో కూడా ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ - తాప్సీ
తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ. బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు..మూడు చిత్రాల్లో నటిస్తున్న తాప్సీ.. గేమ్ ఓవర్ అనే సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.