విజ‌య్‌తో క‌లసి నాలుగోసారి న‌టించ‌నున్న సామ్‌?

Samantha to Work with Vijay for Fourth Time,Telugu Filmnagar,Telugu Filmupdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha New Movie With Vijay,Samantha and Vijay Combo is Back,Samantha and Vijay To Team Up For Fourth Time,Kollywood Actor Vijay Next Film With Samantha,Samantha Next Project Details
Samantha to Work with Vijay for Fourth Time

సమంత… టాలీవుడ్, కోలీవుడ్‌లలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక. అంతేకాదు… ఈ రెండు భాషల్లోనూ ఆల్‌మోస్ట్‌ స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారి కెరీర్ బెస్ట్ హిట్స్‌లో కూడా భాగస్వామి అయిన నాయిక. అయితే… వీరిలో కొంతమందితో రిపీటెడ్‌గా రెండు లేక మూడు చిత్రాలు చేసిన సామ్… యువ సామ్రాట్ నాగ చైతన్యతోనూ(‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’), యంగ్ టైగర్ యన్టీఆర్‌తోనూ(‘బృందావనం’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’, ‘జనతా గ్యారేజ్’) అత్య‌ధికంగా నాలుగేసి చిత్రాల‌లో క‌ల‌సి న‌టించ‌డం విశేషం. ఇంతవరకు టాలీవుడ్ హీరోలతో నాలుగేసి చిత్రాలు చేసిన ఈ చెన్నై బ్యూటీ… ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఆ పరంపరను కొనసాగించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ‘కత్తి’, ‘తెరి’, ‘మెర్సల్’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న సామ్… ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కోసం నాలుగోసారి విజయ్‌తో జట్టు కట్టనుందని కోలీవుడ్ టాక్. మ‌రి నాలుగో సారి యన్టీఆర్‌కు(‘జనతా గ్యారేజ్’), చైతుకి(‘మజిలీ’) కలిసొచ్చిన సామ్… విజయ్‌కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.కాగా… ఈ సినిమాలో సామ్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న‌ రావాల్సి ఉంది.

[subscribe]

[youtube_video videoid=0nmTiPR-AEY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =