`కృష్ణగాడి వీరప్రేమగాథ` వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది మెహరీన్ కౌర్ పిర్జాడ. ఆ తర్వాత `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్`తో వరుస విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ పంజాబీ భామ… ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్‌కు జంటగా ‘చాణక్య’లో నటిస్తోంది. అలాగే… యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘అశ్వథ్థామ’ (ప్రచారంలో ఉన్న పేరు)లోనూ హీరోయిన్‌గా దర్శనమివ్వనుంది. వీటితో పాటు మరో మూడు సినిమాల్లో మెహరీన్ కథానాయికగా నటించబోతున్నట్లు టాక్. అయితే ఈ మూడు వేర్వేరు భాషా చిత్రాలు కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవల ‘118’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నందమూరి కళ్యాణ్ రామ్… ‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగేశ్నతో జట్టు కట్టనున్నట్టు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసే ఈ చిత్రంలో కళ్యాణ్ సరసన మెహరీన్ నాయికగా ఎంపికైనట్టు సమాచారం. మరోవైపు కోలీవుడ్ స్టార్ ధనుష్, మెహరీన్ జంటగా ఓ సినిమా రూపొందుతున్నట్టు కోలీవుడ్ టాక్. ఈ తమిళ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు… కన్నడ హీరో దర్శన్ నటిస్తున్న ఓ కన్నడ మూవీలో కూడా మెహరీన్ కథానాయికగా సెలెక్ట్ అయినట్టు వినికిడి. మొత్తానికి మూడు వేర్వేరు భాషల్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో కనిపించనుందన్నమాట మెహరీన్. త్వరలోనే ఈ చిత్రాలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడి కానున్నాయి.ఇదిలా ఉంటే… మెహరీన్ కథానాయికగా నటించిన తొలి పంజాబీ చిత్రం ‘డీఎస్పీ దేవ్’ జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=IRmyPmrcPXA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: