రౌడీ హీరో మౌనం వెనుక అంతరార్ధం ఏమిటో..?

Vijay Deverakonda Trolled by Fans in Social Media,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Fans in Social Media,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Fans Trolling
Vijay Deverakonda Trolled by Fans in Social Media

విజయ్ దేవరకొండ.. ప్రస్తుత జనరేషన్ కి యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు. అదృష్టం వస్తే ఎవరూ ఆపలేరన్నట్టుగా.. ఈ హీరోకి అదృష్టంపాళ్లు కాస్త ఎక్కువే. అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉందనుకోండి. టాలెంట్ కు అదృష్టం తోడైంది కాబట్టే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్నాడు. లేకపోతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. పెళ్లి చూపులు లాంటి చిన్నసినిమాతో పెద్ద హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డితో నయా ట్రెండ్ క్రియేట్ చేయడంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని.. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరయి.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. విజయ్ తో పెద్ద డైరెక్టర్లు సైతం సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అలాంటి విజయ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? విజయ్ తమ్ముడు ఆనంద్ విషయంలో విజయ్ కు కౌంటర్లు పడుతున్నాయి. తమ్ముడు విషయంలో అన్నకు కౌంటర్లు ఏంటబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఆనంద్ దేవరకొండ హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ కూతురు శివాత్మిక, ఆనంద్ దేవరకొండ జంటగా దొరసాని అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవలే ఈసినిమా టీజర్ కూడా రిలీజైంది. టీజర్ కొంతమందికి నచ్చితే.. కొంతమంది మాత్రం ఆనంద్ లుక్, నటనపై కామెంట్స్ చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.

ఇప్పుడు అందరి సినిమాలపై స్పందించే విజయ్ తన సొంత తమ్ముడి సినిమా గురించి ఎందుకు స్పందించడంలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా ట్రైలర్ చూసిన విజయ్ ఆ ట్రైలర్ ను షేర్ చేసి మరీ బావుందని ప్రశంసలు కురిపించాడు. ఈ పాయింట్ కూడా నెటిజన్స్ కు బాగా ఉపయోగపడింది కామెంట్స్ చేయడానికి.

మరి ఎవరి ఆలోచన ధోరణి వారికి ఉంటుంది. అసలు విజయ్ తన సొంత తమ్ముడి సినిమా విషయంలో సైలెంట్ గా ఉండటం వెనుక అతని మనసులో ఏముందో ఎవరికి తెలుసు. ఏమో తన సపోర్ట్ లేకుండా తన తమ్ముడు తన సొంత కాళ్లపై పైకి ఎదగాలని చూస్తున్నాడేమో..? లేకపోతే తమ్ముడి సినిమా కదా అందుకే సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటారని సైలెంట్ గా ఉన్నాడేమో..? నెపోటిజం ఎంకరేజ్ చేయకూడదనుకుంటున్నాడేమో.. నెగిటివ్ గా చూడటం ఎందుకు పాజిటివ్ యాంగిల్ లో చూస్తే బెటర్ కదా. మరి ఆ మౌనం వెనుక అంతరార్థం ఏమిటో తను చెబితే కానీ తెలీదు..

[subscribe]

[youtube_video videoid=GWcU5WEchyY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =