స్పానిష్ థ్రిల్లర్ రీమేక్‌లో అనుష్క‌?

Anushka to come up with a Spanish Thriller,Telugu Filmnagar,Telugu Filmupdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anushka Next Film Updates,Anushka New Movie News,Anushka in the Remake of a Spanish Thriller,Anushka Signed Spanish Thriller Film,Anushka to Reamke Spanish Film
Anushka to come up with a Spanish Thriller

‘అరుంధతి’, ‘పంచాక్షరి’, `వ‌ర్ణ‌`, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తర్వాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్… ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే పేరుతో విడుదల కానున్న ఈ చిత్రం… ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీ, ఆంగ్ల‌ భాషల్లో కూడా విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి… హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే… ఓ స్పానిష్ థ్రిల్లర్ మూవీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట స్వీటీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… 2010లో విడుదలై ఘన విజయం సాధించిన స్పానిష్ థ్రిల్లర్ ఫిలిమ్‌ ‘జూలియాస్ ఐస్’ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రీమేక్ చేయడానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ ప్లాన్ చేస్తున్నాడ‌ని టాలీవుడ్ టాక్. క‌బీర్ లాల్ ద‌ర్శ‌క‌త్వంలో రివెంజ్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయ‌నుంద‌ని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు జరుపుకుంటున్న ఈ మూవీ… వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

[youtube_video videoid=NK_jtSSt7BY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.