ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన సినీ పరిశ్రమ ఇప్పుడు దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ మరో గొప్ప రచయిత మరియు నటుడిని కోల్పోయింది. ఆయనే గిరీష్ కర్నాడ్. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ ఈరోజు బెంగళూరులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాలో గిరీష్ కర్నాడ్ జన్మించారు. గిరీష్ కర్నాడ్ పూర్తి పేరు గిరీష్ రఘునాత్ కర్నాడ్. గిరీష్ తల్లి కృష్ణబాయి చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. నర్స్ అయిన కృష్ణబాయిని డాక్టర్ రఘునాథ్ కర్నాడ్ వివాహం చేసుకున్నారు. ఆ తరవాత జన్మించిన నలుగురు సంతానంలో గిరీష్ కర్నాడ్ ఒకరు. చిన్నప్పటినుండే రచనల మీద ఆసక్తి ఉన్న గిరీష్ తన ఆసక్తికి తగినట్టుగానే గొప్ప రచయిత అయ్యాడు. తుఝ, తలిదండ ఆయన కన్నడ ప్రముఖ రచనలు.
సినిమాలు
1970లో కన్నడ సినిమా సంస్కార్ నుంచి గిరీష్ కర్నాడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఆయన మొదటి సినిమాకు రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ పురస్కారం లభించింది. ఒక్క కన్నడంలోనే కాదు.. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈయన తన నటనతో అలరించారు. కేవలం రచయిత, నటుడిగానే కాదు… దర్శకుడిగా కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ధర్మచక్రం, రక్షకుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, కొమరం పులి వంటి పలు చిత్రాల్లో నటించి చెరగని ముద్రవేశారు. అలా నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎనలేని సేవలు అందించారు. గిరీష్ చివరిగా నటించిన చిత్రం ‘అప్నా దేశ్’. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది.
అవార్డులు
పలు భాషల్లో నటింటి మెప్పించిన గిరీష్ కర్నాడ్ కు అవార్డులు కూడా చాలానే లభించాయి. వంశవృక్ష అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. అంతేకాదు..రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు ఆయనకు వరించింది. ఇక ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.
- గిరీష్ కర్నాడ్‌కు 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ లభించాయి.
- 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1998లో కాళిదాసు అవార్డుతో ఆయన్ను సత్కరించారు.
[subscribe]
[youtube_video videoid=WCnOvQuijdU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: