“మహర్షి” సాధించిన అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా , కుమారుడు గౌతం, కుమార్తె సితార హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా సతీ సమేతంగా యూరోపియన్ కంట్రీస్ లో పర్యటిస్తున్నారు. అయితే అందరూ కలిసి మహర్షి సక్సెస్ ను మరింతగ సెలబ్రేట్ చేసుకునేందుకు మంచి వేడుక- వేదిక ఏది? అని ఆలోచించి చివరకు లండన్ లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 9న జరగనున్న వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ సందర్భంగా అందరూ కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. ఆరోజున మహేష్ బాబు తన ఫ్యామిలీతో లండన్ చేరుకోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తోపాటు నిర్మాత దిల్ రాజు,మ్యాంగో గ్రూప్ అధినేత రామ్ వీరపనేనితో పాటూ మరికొందరు ఆంతరంగిక మిత్రులు కలిసి లండన్ లోని ఓవల్ మైదానంలో ప్రేక్షకుల మధ్య కూర్చుని క్రికెట్ మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ని ప్రత్యక్షంగా ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడటంలో ఉన్న “కిక్” ను వీరంతా ఎంజాయ్ చేశారు. ఒకవైపు మహర్షి సాధించిన అద్భుత విజయం తాలూకు ఆనందం మరోవైపు టీమిండియా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆనందం కలగలిసిన “కాక్టెయిల్డ్” కిక్కును వీరంతా ఎంజాయ్ చేశారు. అలాగే మహేష్ బాబు గురించి , మహర్షి సక్సెస్ గురించి తెలుగు కామెంటేటర్స్ వ్యాఖ్యానించినప్పుడు గ్యాలరీలోని తెలుగు వాళ్ళ నుండి అద్భుత స్పందన లభించడం కనిపించింది.
ఇక్కడ మహర్షి సాధించిన అద్భుత విజయాన్ని అక్కడ ఓవల్ మైదానంలో సెలబ్రేట్ చేసుకున్న మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి అండ్ ఫ్యామిలీ, దిల్ రాజు, రామ్ వీరపనేని తదితరులకు అభినందనలు.
#INDvAUS.. At the Oval.. 🙂#CelebratingMaharshi pic.twitter.com/eINFf18umX
— Vamshi Paidipally (@directorvamshi) June 9, 2019
Unbelievable energy at The Oval… Just awesome!!#INDvAUS🏏 pic.twitter.com/9Hn1UulRW5
— Mahesh Babu (@urstrulyMahesh) June 9, 2019
This one’s for my boy…🏏 ♥♥ #INDvAUS @ The Oval pic.twitter.com/35MgIm1nwc
— Mahesh Babu (@urstrulyMahesh) June 9, 2019
[subscribe]
[youtube_video videoid=zRzdy1KNGv4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: