‘మన్మథుడు 2’ టీజ‌ర్ ఎప్పుడంటే…

Manmadhudu 2 Teaser Release Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Teaser Release Date,Interesting Updates on Manmadhudu 2,Manmadhudu 2 Teaser Gets a Release
Manmadhudu 2 Teaser Release Update

కింగ్ నాగార్జున క్లాసిక్ హిట్ `మ‌న్మ‌థుడు`కి సీక్వెల్‌గా వ‌స్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని యువ ద‌ర్శ‌కుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా… ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం… ప్రస్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ‘మన్మథుడు 2’ టీజ‌ర్‌ను జూన్ 10న విడుదల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు సమాచారం. దీనికి సంబంధించిన‌ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు నెలాఖరులో ‘మన్మథుడు 2’ను విడుదల చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.

[subscribe]
[youtube_video videoid=j7B34XDQ3Bo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =