ఎన్ని కోట్ల పెట్టి సినిమాలు తీసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా అవి ప్రేక్షకులకు చూపెట్టడానికే. ఇక ప్రేక్షకుడికి సినిమా నచ్చిందా.. నెత్తినపెట్టుకొని చూస్తారు… సినిమా బాలేదా.. ఎలాంటి మొహమాటం లేకుండా సినిమాను పాతాళానికి తొక్కేస్తారు. అందుకే ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ప్రేక్షక దేవుళ్లు అని సంబోధిస్తారు. ఇక అభిమాలు కూడా తమ అభిమాన హీరోపై కానీ.. హీరోయిన్ పై కానీ ఎంత ప్రేమ చూపిస్తారో.. అది వెలకట్టలేనిది అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు అని చెప్పినట్టు.. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా కాదు.. ఇంటర్నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించిపెట్టింది. ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతోపాటు నార్త్‌లోనూ..విదేశాల్లోనూ డార్లింగ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ఇక లేడీ ఫ్యాన్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రేక్షకులే కాదు… పలువురు సెలబ్రిటీలు కూడా ఇప్పుడు తమ ఫేవరెట్ హీరో ప్రభాస్ అని చెబుతున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు ప్రభాస్ స్టార్ డమ్ ఎంత పెరిగిందో.
ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడెందుకంటారా..? అసలు సంగతేంటంటే.. ప్రభాస్ ఇంటి దగ్గర ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకోవడమే. కొంతమంది అభిమానులు ప్రభాస్ ను కలవడానికి అతని ఇంటికొచ్చారట. ఇందులో కొత్తేముంది.. అందరు హీరోలకు జరిగేదే కదా అని అనుకుంటున్నారేమో.. అక్కడే ఉంది ట్విస్ట్.. వచ్చింది లేడీ ఫ్యాన్స్.. అది కూడా ఏ తెలుగు రాష్ట్రాలో.. లేక వేరే రాష్ట్రాల నుండో కాదు.. ఏకంగా వేరే దేశం నుండి.. ప్రభాస్ ను కలవడానికి దాదాపు 10 మంది లేడీ ఫ్యాన్స్ జపాన్ నుండి వచ్చారు. ప్రభాస్‌ను కలిసి మాట్లాడి, ఒక్క ఫోటో తీసుకోవాలని వారంతా వెలకట్టలేని అభిమానంతో, ఖండాంతరాలు దాటి హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ఇంటికి వచ్చారు. మరి ఇది గ్రేటే కదా.
మరి దీనిబట్టి తెలుస్తుంది కదా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిపోయిందో. వేరే దేశం నుండి ప్రభాస్ కోసం వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు.
కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. భారీ బడ్జెట్ తో ఇంతకుముందెన్నడూ లేని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో చూపిస్తున్నారు దర్శకుడు సుజిత్. ఇక బాహుబలి ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగష్ట్ 15న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి ఈ సినిమాలు ప్రభాస్ పై పెట్టుకున్న అంచనాలను తాకుతాయా లేదా అన్నది మాత్రం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=2UqswPJbzzA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: