
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 92


అంతా ఓకే ఎలాంటి అపార్థాలు లేవు

`సాహో` రోజునే రానున్న సూర్య చిత్రం?

వెంకటేష్ `రాజా`కి 20 ఏళ్ళు

ఐరా మూవీ రిలీజ్ కు రెడీ

ప్రాజెక్ట్ #5 అప్ డేట్ త్వరలో

కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లో గోపీచంద్

తెలుగు మూవీ లో విలన్ గా తమిళ హీరో

ఈ నెల 25 నుంచి `మన్మథుడు 2`?

బాలయ్యతో `రామారావు గారు`... ఎప్పుడంటే?

బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టోరీ లైన్ అదేనా?

డియర్ కామ్రేడ్ టీజర్ రిలీజ్

మరోసారి మనసు దోచుకున్న మహర్షి

సైనా బయోపిక్ నుండి శ్రద్ద ఔట్

ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ రిలీజ్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఓ బేబి'

దిల్ రాజు చేతిలో సూర్యకాంతం

షూటింగ్ పూర్తి చేసుకున్న 'చిత్రలహరి'

ఐదు చిత్రాలతో బిజీగా సునీల్
హాస్య నటుడిగా కెరీర్‌ని ఆరంభించి... కథానాయకుడిగా ఎదిగాడు సునీల్. హీరోగా ఆరంభంలో మంచి విజయాలు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్... ఆ తరువాత మాత్రం కాస్త ట్రాక్ తప్పాడు. ఈ నేపథ్యంలో... మళ్ళీ యూ టర్న్ తీసుకుని కమెడియన్‌గా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ద్వితీయార్ధంలో విడుదలైన `అరవింద సమేత వీరరాఘవ`తో విజయాన్ని అందుకున్న సునీల్... ఆ తరువాత `అమర్ అక్బర్ ఆంటొని`, `పడి పడి లేచె మనసు` చిత్రాలతో అలరించాడు.

అంతా ఓకే ఎలాంటి అపార్థాలు లేవు
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై ఇప్పుడు మంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ కి సంబంధించిన ఓ కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేయడం దానిపై స్పందించిన సీఈఓ సినిమా చూడకుండానే ఈసీకి ఆపే రైట్ లేదని అనడంతో ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు ఉన్న ఒక అడ్డు తొలగినట్టే అనుకున్నారు. అయితే అసలైన సమస్య సెన్సార్ బోర్డ్ నుండి ఎదుర్కోవాల్సి ఉంది చిత్రయూనిట్.

లేటెస్ట్ మూవీస్ లెేటెస్ట్ కలెక్షన్స్
ఈ వారం బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి ఈ వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

`సాహో` రోజునే రానున్న సూర్య చిత్రం?
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి శ్రీ రాఘవ దర్శకత్వంలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` కాగా... మరొకటి కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాప్పాన్`. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న `ఎన్జీకే`... ఈద్ సందర్భంగా జూన్ మొదటి వారంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. ఇక సాయేషా హీరోయిన్‌గానూ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఆర్య ఇతర ప్రధాన పాత్రల్లోనూ నటిస్తున్న `కాప్పాన్`ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం…

వెంకటేష్ `రాజా`కి 20 ఏళ్ళు
వెంకటేష్, సౌందర్య... తెలుగునాట హిట్ పెయిర్‌గా రాణించిన జోడీ. `సూపర్ పోలీస్`(1994)తో మొదలైన ఈ జంట ప్రయాణం... `దేవీ పుత్రుడు` (2001) వరకు ఏడు చిత్రాల పాటు కొనసాగింది. అయితే... వీరి కాంబినేషన్‌లో తొలి, తుది చిత్రాలు నిరాశపరిచినా... మధ్యలో వచ్చిన `ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు`, `పవిత్ర బంధం`, `పెళ్ళి చేసుకుందాం`, `రాజా`, `జయం మనదేరా` మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. ముఖ్యంగా... `రాజా` చిత్రంలో ఈ జంట అభిమానులకు కనుల పంట అయ్యింది. తమిళ చిత్రం `ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై…

ఐరా మూవీ రిలీజ్ కు రెడీ
తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయిక గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కమర్షియల్ మూవీస్ తో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గంగా ఎంటర్ టైన్ మెంట్స్, KJR స్టూడియోస్ బ్యానర్స్ పై సర్జున్ దర్శకత్వంలో నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఐరా మూవీ తెలుగు, తమిళ భాషలలో మార్చి 28వ తేదీ రిలీజ్ కానుంది.

విజయ్‌తో మరో సినిమా చేయనున్న టాలెంటెడ్ డైరెక్టర్
తమిళనాట ఒకప్పుడు రీమేక్‌ల స్పెషలిస్ట్ అనిపించుకున్న ఆ దర్శకుడు... ఇప్పుడు ట్రాక్ మార్చి తనే రీమేక్‌లకు సోర్స్ ఇస్తున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు... `హనుమాన్ జంక్షన్` (2001)తో దర్శకుడిగా అవతారమెత్తిన మోహన్ రాజా. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత`ఎడిటర్` మోహన్‌కి తనయుడైన రాజా... `హనుమాన్ జంక్షన్` తరువాత తమిళ చిత్ర సీమ బాట పట్టాడు. అక్కడ `జయం`, `అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి`, `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`, `బొమ్మరిల్లు` రీమేక్‌లతో ఘనవిజయాలను అందుకున్నాడు. ఆ తరువాత ట్రాక్ తప్పడంతో... `తని ఒరువన్`తో స్ట్రయిట్ పిక్చర్ తీసి…

ప్రాజెక్ట్ #5 అప్ డేట్ త్వరలో
సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లు రావడం అనేది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2` ఇలా వరుస హిట్లు కొడుతూ.. అతి తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఇటీవల వచ్చిన ఎఫ్ 2 ఘన విజయంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లో గోపీచంద్
యాక్షన్ హీరో గా పేరుపొందిన గోపీచంద్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లౌక్యం 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి, గోపీచంద్ సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. తిరిగి ఇన్ని సంవత్సరాలకు గోపీచంద్ ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగు మూవీ లో విలన్ గా తమిళ హీరో
సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి , చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి మరో తెలుగు మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ ఒక మూవీ ని రూపొందిస్తున్నాయి.

ఈ నెల 25 నుంచి `మన్మథుడు 2`?
కింగ్ నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ `మన్మథుడు` (2002)కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నాగ్‌కి జోడీగా అందాల తారలు రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్‌పుత్ నాయికలుగా నటించనున్నారని సమాచారం. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ సంగీతమందించనున్నాడు.

బాలయ్యతో `రామారావు గారు`... ఎప్పుడంటే?
`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో తనకు తిరుగులేదనిపించుకున్న అనిల్... ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. `దూకుడు` తరహాలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగనుందని సమాచారం. `మహర్షి` విడుదలయ్యాకే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్‌ని 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టోరీ లైన్ అదేనా?
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. `నాన్న నేను` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పూజా హెగ్డే, కేథరిన్ ట్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తారని టాక్. అలాగే... త్రివిక్రమ్ చిరకాల…

డియర్ కామ్రేడ్ టీజర్ రిలీజ్
గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొంద, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ నాలుగు భాషలలో ఒకేసారి టీజర్ ను రిలీజ్ చేశారు.

మరోసారి మనసు దోచుకున్న మహర్షి
సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లోనే కాదు ఇటు సేవా కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటారని మనకు చాలా సందర్భాల్లోనే నిరూపితమైంది. కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నదాన్ని బాగా ఫాలో అవుతాడు మహేష్. అందుకే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సైలెంట్ గా ఉంటాడే తప్పా.. పబ్లిసిటీ చేసుకునే మనిషి కాదు.

సైనా బయోపిక్ నుండి శ్రద్ద ఔట్
అటు బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గుడుపుతోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఈ నేపథ్యంలోనే అమోల్ సేన్ గుప్తా దర్శకత్వంలో బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా శ్రద్ద నటిస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సైనా పాత్రలో నటించేందుకు గాను సైనా కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది శ్రద్ధాకపూర్.

ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ రిలీజ్
కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఓ బేబి'
సమంత ప్రధాన పాత్రలో కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

దిల్ రాజు చేతిలో సూర్యకాంతం
ఒక మనసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించి మరోసారి అలరించింది మెగా హీరోయిన్ నిహారిక. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఇప్పుడు డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'చిత్రలహరి'
వరుస పరాజయాల తరువాత చిత్రలహరి అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.. మంచి ప్రమోషన్ స్టార్ట్ అంటూ.. యూనిక్ కాన్పెస్ట్ అంటూ టీజర్ మంచి టాకే సంపాదించుకుంది. ఇక తాాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.