బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బి. చిన్నికృష్ణ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేయగా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. టీజర్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.
కాగా చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో నందిత శ్వేతన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=HCWu246GxOk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: