ప్రముఖ నిర్మాణ సంస్థకు ‘ఓటర్’ మూవీ రైట్స్

Voter Movie Rights Acquired By Popular Production House,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Theatrical Rights,Voter Movie Rights,Voter Movie Latest Updates,Voter Telugu Movie Latest News
Voter Movie Rights Acquired By Popular Production House

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ఈ మూవీ విడుదల హక్కులను నిర్మాణ సంస్థ సార్థక మూవీస్ చేజిక్కుంచుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్థక మూవీస్ అధినేత అయిన ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో మా సంస్థలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడం,అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే గట్టిపోటీ మధ్య ‘ఓటర్’ మూవీ విడుదల హక్కులను, అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్నాం అన్నారు. అలాగే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నాం అన్నారు.

కాగా ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా సురభి నటిస్తుండగా… సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జాన్‌సుధీర్‌ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్. సంగీతం అందిస్తున్నాడు. మరి పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. మ‌రి చూద్దాం ఈ సినిమా మంచు విష్ణుకి సక్సెస్ తెచ్చిపెడుతుందో?లేదో?

[subscribe]

[youtube_video videoid=EvZJQb28buA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =