కొర‌టాల సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న‌ చిరు?

2019 Latest Telugu Movie News, Chiranjeevi To Lose Weight For Koratala Siva Movie,Chiranjeevi To Shed Weight For Koratala Siva Movie, Koratala Siva pushing Chiranjeevi for weight loss, chiranjeevi diet plans for koratala siva movie, chiranjeevi upcoming movie updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Megastar Chiranjeevi To Lose Weight For Koratala Siva Movie

తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందీ సినిమా. ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఇదిలా ఉంటే… ‘సైరా’ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. అయితే… ‘సైరా’లోని పాత్ర కోసం బాగా బరువు పెరిగిన చిరు… ఇప్పుడు కొరటాల శివతో చేయబోయే మూవీ కోసం సన్నగా, స్మార్ట్ అండ్ స్టైలిష్ లుక్‌లోకి మారనున్నార‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఆల్రెడీ చిరు కోసం ఓ మెసేజ్‌ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను రెడీ చేసాడట కొరటాల. ఇందులో చిరు రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నార‌ట. అందులోని ఒక పాత్ర… ప్రస్తుతం చిరు వయసుకన్న తక్కువ వయసుండే యంగ్ క్యారెక్ట‌ర్‌ కావడంతో ఆ పాత్ర డిమాండ్ మేరకు సన్నగా, స్మార్ట్‌గా, పూర్తి ఫిట్ నెస్‌తో కనిపించడానికి సిద్ధపడ్డార‌ట చిరు. ఇందుకోసం చిరు తనయుడు, నిర్మాతల్లో ఒక‌రైన‌ రామ్ చరణ్ ఓ స్పెషల్ ట్రైనర్‌ను కూడా అప్పాయింట్ చేసాడని సమాచారం. మరి ఈ చిత్రంలో చిరు లుక్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న చిరు – కొర‌టాల‌ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=uiqL3xbQuTs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − sixteen =