సమరసింహా రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అభినందనలు

2019 Latest Telugu Movie News,Is Andhra Pradesh Chief Minister YS Jagan A Huge Fan Of Balakrishna?,YS Jagan Die Hard Fan of Balakrishna,AP CM YS Jagan About Balakrishna,YS Jagan Big Fan of Balayya,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News
Is Andhra Pradesh Chief Minister YS Jagan A Huge Fan Of Balakrishna?

కాలం చాలా విచిత్రమైంది. కాలగమనంలో ఊహకందని మలుపులు , ఊహాతీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి అనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి – నందమూరి నటసింహం బాలకృష్ణల అనుబంధం గురించి చెప్పుకోవచ్చు. సినిమాల పట్ల, సినిమా రంగంపట్ల నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప అభిమానం, ఆసక్తి ఉన్నాయి అనటానికి తాజా ఉదాహరణలు ఏమీ లేవు కానీ ఒకప్పుడు ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అన్నది మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలియదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా 1990, 2000 దశాబ్దాల కాలంలో నవ యువకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణ అభిమానిగా ఆయన సినిమాలను బాగా చూసేవారట. అంతేకాకుండా బాలకృష్ణ సినిమాలు బాగా ఆడటం కోసం అభిమానులందరినీ ఉత్సాహపరిచేవారట. అందుకు బాలకృష్ణ నటించిన “మాతో పెట్టుకోకు” చిత్రం ఒక్క పులివెందుల లో మాత్రమే వంద రోజులు ఆడటాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా అన్ని చోట్ల ఫెయిల్ అయినప్పటికీ పులివెందులలో 100 రోజులు ప్రదర్శించబడటం వెనుక జగన్ ప్రోద్బలం, అభిమానమే కారణం అని బాలయ్య అభిమానులు చెప్తుంటారు. ఇక్కడ మరొక విచిత్రమైన కో ఇన్సిడెంట్ ఏమిటంటే … ఆ సినిమా హీరో బాలకృష్ణ, హీరోయిన్ రోజా ఇద్దరు ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష- పాలకపక్ష సభ్యులు కావటం.

సమరసింహారెడ్డి చిత్రం అఖండ విజయాన్ని సాధిస్తూ 365 రోజులు ప్రదర్శింపబడిన సందర్భంలో వచ్చిన నూతన సంవత్సరం 2000 కు స్వాగతం చెబుతూ, బాలకృష్ణ కు అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా చెబుతున్న ఒక పత్రికా ప్రకటన కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కొంతమంది అభిమానులు ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన కాదు అంటారు…

ఏది ఏమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు బాలకృష్ణ అభిమాని కావటం… బాలకృష్ణ ప్రతిపక్ష శాసన సభ్యునిగా అసెంబ్లీలో ఉండటం… అదే అసెంబ్లీలో బాలకృష్ణతో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన రోజా పాలకపక్ష శాసనసభ్యురాలిగా ఉండటం చాలా యాదృచ్చిక విశేషాలు. అయితే ఇంతవరకు బాలకృష్ణ -జగన్మోహన్ రెడ్డి ఒకరి కొకరు తారసపడలేదు. అలా వారిద్దరూ తారసపడే సందర్భం కోసం ఇరువురి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1983 లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన అభిమానులు చాలామందికి పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు. అభిమాన తార ముఖ్యమంత్రిగా, అభిమానులు ఎమ్మెల్యేలుగా ఉండటం అప్పుడు చూసాం….అభిమాన తార ఎమ్మెల్యేగా.. అభిమాని ముఖ్యమంత్రిగా ఉండటం ఇప్పుడు చూస్తున్నాం. కాలం విచిత్రమైంది అనటానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు.

[subscribe]

[youtube_video videoid=jUxnrFUYzBA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =