‘సత్తెకాలపు సత్తెయ్య’కు 50 ఏళ్ళు

2019 Latest Telugu Movie News,50 Years For Sattekalapu Satteya Movie,Sattekalapu Satteya Movie completes 50 years,shoban Babu Sattekalapu Satteya Movie completed 50 years,Sattekalapu Satteya Movie Turns 50 Years,Sattekalapu Satteya Movie Latest News,Telugu Film Updates, Telugu Filmnagar,Tollywood Cinema News
50 Years For Sattekalapu Satteya Movie

తెర వెనక చలం, శోభన్ బాబు ఎంత మంచి స్నేహితులో… తెరపై కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ అంతటి విజయవంతమైనది. ఈ ఇద్దరి కలయికలో వ‌చ్చిన ప‌లు సినిమాలు విజయవంతం కాగా… వాటిలో ‘సత్తెకాలపు సత్తెయ్య’ ఒకటి. దర్శ‌క‌దిగ్గ‌జం కె.బాలచందర్ రూపొందించిన‌ ఈ చిత్రంలో చలం, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో న‌టించ‌గా… రాజశ్రీ, విజయలలిత, బేబి రోజారమణి, గుమ్మడి, వరలక్ష్మి, సత్యనారాయణ త‌దిత‌రులు ముఖ్య భూమికలను పోషించారు. ఎం.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పనలో రూపొందిన బాణీలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో “నన్ను ఎవరో తాకిరి”, “ముద్దు ముద్దు నవ్వు” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి.

తెలుగులో ‘భలే కోడళ్ళు’ త‌రువాత బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. తమిళంలో ‘పత్తామ్ పస‌లి’ (ద‌ర్శ‌క‌త్వం: బాలచందర్) పేరుతోనూ, హిందీలో ‘మస్తానా’ (ఆదుర్తి సుబ్బారావు) పేరుతోనూ, కన్నడలో ‘మంకు తిమ్మ’ (హెచ్.ఆర్.భార్గవ) పేరుతోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది. వి.కె.ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ‘సత్తెకాలపు సత్తెయ్య’ 1969 జూన్ 19న విడుదలై… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here