కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 37

2019 Latest Telugu Movie News, Rajasekhar Ankusham Completes 30 Years, Rajasekhar Ankusham Successfully Completes 30 Years, 30 Glorified Years For Rajasekhar Ankusham, Rajasekhar Ankusham Telugu Movie, Rajasekhar Latest movie News, Telugu Film Update
సినిమా వార్తలు

రాజ‌శేఖ‌ర్ ‘అంకుశం’కు 30 ఏళ్ళు

అగ్ర కథానాయకుడు డా.రాజశేఖర్‌కు కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘అంకుశం’ ఒక‌టి. రాజశేఖర్ కెరీర్‌ని కీల‌క మలుపు తిప్పిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో... ఆయ‌న నిజ‌జీవిత భాగ‌స్వామి అయిన‌ జీవిత కథానాయికగా నటించింది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రెడ్డి కీలకపాత్ర పోషించగా... ప్ర‌తినాయ‌కుడిగా రామిరెడ్డి న‌టించాడు. న‌టుడిగా రామిరెడ్డికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంతోనే రాజశేఖర్ టాలీవుడ్ `యాంగ్రీ యంగ్ మ్యాన్‌`గా పేరు తెచ్చుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఉదయ్ రహస్యాలూ తెలుసు కానీ బయోపిక్ తీయను

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ పేరుతో వాళ్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించారు. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నో హిట్ సినిమాలు తీసి.. దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అది కూడా ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన తేజ దర్శకత్వంలో.

TFN Adminవాట్సాప్
#GangLeader, 2019 Latest Telugu Movie News, Gang Leader Movie Pre Look Releasing Tomorrow, Gang Leader Movie Updates, Gang Leader Pre Look Release Date Locked, Gang Leader Telugu Movie Latest News, Gang Leader Telugu Movie Pre Look Release Date, Nani
సినిమా వార్తలు

గ్యాంగ్ లీడర్ నుండి రాబోతున్న ప్రీ లుక్

మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరగా సినిమాను కంప్లీట్ చేసి ఆగష్ట్ 30వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 11 గంటలకు ప్రీ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు నాని స్వయంగా ఓవీడియో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల సందడి మొదలైనట్టే. కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుంది. ఇక ఈరోజు కూడా రాజ్ దూత్, దొరసాని, కేఎస్ 100 సినిమా సినిమాలు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గత వారం.. ఈరోజు రిలీజైన సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Calls Suriya as Comrade, Vijay Deverakonda Says Suriya is real Comrade, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda About Dear Comrade Movie, Dear Comrade Movie Latest Updates, Telugu Film U
సినిమా వార్తలు

మీరే నా రియల్ కామ్రేడ్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 26 తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజవ్వగా.. నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nayanthara to Play Seetha Character for 2nd Time, Nayanthara to play another epic character, Nayanthara to play Draupadi in Kurukshetra, Nayanthara Latest Movie News, Nayanthara to Play Interesting Role In his Next, Nay
సినిమా వార్తలు

మరోసారి సీతగా నయనతార ?

దర్శకుడు బాపు రూపొందించిన శ్రీరామరాజ్యం మూవీ లో నయనతార సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నయనతార తన సినీకెరీర్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ శ్రీరామరాజ్యం. సీత గా అద్భుతంగా నటించిన నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషలలో అగ్ర తార గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి సీత పాత్రలో నటించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి లో నయనతార కథానాయిక.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Tamannaah to do an Action Role Once Again After Baahubali, After Baahubali Actress Tamannaah in an action role yet again, Tamannaah Got A chance In Action Role, Tamannaah On Action Mode, Tamannaah Latest Movie News, Tel
సినిమా వార్తలు

యాక్షన్ రోల్ లో మిల్కీ బ్యూటీ

తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్న తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత ఒక తమిళ మూవీ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా బాహుబలి మూవీ లో వారియర్ ప్రిన్సెస్ అవంతికగా హై వోల్టేజి యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తమన్నా తెలుగు లో నటించిన బ్లాక్ బస్టర్ క్వీన్ హిందీ మూవీ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. తెలుగు లో సైరా నరసింహా రెడ్డి, తమిళ్ లో KV ఆనంద్ మూవీ, సుందర్ C మూవీ, సూపర్ హిట్ తెలుగు మూవీ ఆనందో బ్రహ్మ తమిళ రీమేక్ మూవీ షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. బోలే చూడియాన్ హిందీ మూవీ కి సెలెక్ట్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ram Charan Dedicates His First Instagram Post To His Mother, Ram Charan first Instagram post reveals, Ram Charan dedicates debut Instagram post to Mother, Ram Charan first Instagram post is Here, Ram Charan Latest movie
సినిమా వార్తలు

ఇన్ స్టాలో చెర్రీ ఫస్ట్ పోస్ట్ అమ్మకి అంకితం

మెగా పవర్ స్టార్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో కొత్తగా అకౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పోస్ట్ మాత్రం ఈరోజు పోస్ట్ చేస్తానని రెండు రోజుల క్రితమే ఓ వీడియో ద్వారా తెలిపాడు. దీంతో చెర్రీ అభిమానులు తమ అభిమాన హీరో ఫస్ట్ పోస్ట్ ఏముంటుందబ్బా అని ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇక ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ ను తమ అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లి సురేఖతో కలిసి దిగిన రెండు చిత్రాలను రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు తల్లితో ఉన్న చిత్రాన్ని, ఆపై హీరోగా మారిన తరువాత తల్లితో ఒడిలో సేదదీరుతూ దిగిన చిత్రాన్ని పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట్ అటు అభిమానులకే కాదు నెటిజన్లందరికీ నచ్చేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna and KS Ravikumar Movie Postponed to 2020 Summer, Balakrishna And KS Ravikumar Movie Updates, Balakrishna Postponed To Summer, Balakrishna and KS Ravikumar Movie To Release For This Summer, Balakrishna Next m
సినిమా వార్తలు

స‌ంక్రాంతి నుంచి వేస‌వికి వాయిదా ప‌డ్డ బాల‌య్య చిత్రం?

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఓ బేబీ’ హిందీ రీమేక్‌లో అలియా భ‌ట్‌?

కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెర‌కెక్కిన తెలుగు చిత్రం `ఓ బేబీ`. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో నందినీ రెడ్డి రూపొందించిన ఈ సోషియో ఫాంట‌సీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్... ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోంది. కాగా, ఈ సినిమాని హిందీలోనూ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్‌ని నిర్మించిన డి.సురేష్ బాబే... హిందీ వెర్ష‌న్‌ని కూడా నిర్మించ‌నున్నార‌ని టాక్‌. కాగా... ఇక్క‌డ‌ సామ్ పోషించిన పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Chiranjeevi to Pair up with Aishwarya Rai, Chiranjeevi Next Movie with Aishwarya Rai, Chiranjeevi And Aishwarya Rai To Team Up For The Very First , Aishwarya Rai Bachchan roped in for Chiranjeevi next, Aishwarya Rai Mov
సినిమా వార్తలు

చిరుకి జోడీగా ఐష్‌?

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరు డ్యూయల్ రోల్‌లో దర్శనమివ్వనున్నారని టాక్‌. అందులో ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ఎన్నారై పాత్ర అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త‌ ఫిలిమ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్‌ ‘RX 100’కి ఏడాది

చిన్న సినిమాలుగా విడుదలై బాక్సాఫీస్ వ‌ద్ద‌ సంచలనాలు సృష్టించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో ‘RX 100’ ఒకటి. స‌రికొత్త కోణంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం... గ‌త ఏడాది తెలుగునాట సెన్సేష‌న‌ల్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌చింది. అజయ్ భూపతి తొలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా పాయ‌ల్ పాత్ర‌, ఆమె న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. సీనియ‌ర్ న‌టులు రావు రమేష్, రాంకీ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`విరాట ప‌ర్వం` సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్‌

రానా, సాయిపల్లవి జంట‌గా న‌టిస్తున్న‌ చిత్రం ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కథ’తో ద‌ర్శ‌కుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడ‌ని టాక్. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Meghamsh Srihari Emotional Letter To Telugu Audience, Meghamsh Srihari About Rajdooth Movie, Meghamsh Srihari Latest Movie News, Meghamsh Srihari Emotional Conversation With Audience, Rajdooth Telugu movie, Emotional Le
సినిమా వార్తలు

ప్రేక్షకులకు హీరో మేఘాంశ్ లేఖ

లెజండరీ యాక్టర్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా టాలీవుడ్ కు రాజ్ దూత్ మూవీ తో పరిచయమవుతున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్జున్ - కార్తీక్ దర్శకత్వంలో మేఘాంశ్, నక్షత్ర జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ రాజ్ దూత్ మూవీ ఈ రోజు రిలీజయింది. బైక్ నేపథ్యం లో రూపొందిన ఈ మూవీ కి వరుణ్ సునీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రాజ్ దూత్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్ ‘వసంతం’కు 16 ఏళ్ళు

ఆడ - మ‌గ స్నేహితుల క‌థ‌ల‌తో తెలుగునాట ప‌లు చిత్రాలు రూపొందాయి. వాటిలో `వ‌సంతం`కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. విక్ట‌రీ వెంకటేష్, కళ్యాణి ప్రాణ స్నేహితులుగా నటించిన ఈ సినిమాని... వెంకీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. `నువ్వు నాకు న‌చ్చావ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వెంకీకి జోడీగా ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో ఆకాష్, సునీల్, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగఅశోక్ కుమార్ నిర్మించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Rashmika Latest Movie News, Dear Comrade Movie Latest Updates, Rashmika Mandanna About Dear Comrade Movie, Rashmika Mandanna Speaks About Dear Comrade, Rashmika Mandanna Speaks About Hardwork Behind Cricket Play
సినిమా వార్తలు

5 నిమిషాల కోసం 4 నెలల కష్టం

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. జులై 26వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడే అవకాశం ఉందన్న టాక్స్ వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

అడివి శేష్ 'ఎవరు' ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేశాడు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని.. అవి రివీల్ కాకూడదనే సీక్రెట్ గా షూటింగ్ చేశామని చెబుతున్నాడు శేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అర్జునుడి పాత్రలో సోనూసూద్

KCN మూవీస్ బ్యానర్ పై నాగన్న దర్శకత్వంలో రవిచంద్రన్ కృష్ణుడు, దర్శన్ దుర్యోధనుడు, అర్జున్ కర్ణుడు, సోనూసూద్ అర్జునుడు గా కన్నడ భాషలో భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందిన కురుక్షేత్ర మూవీ కన్నడ, తెలుగు, తమిళ , హిందీ భాషలలో ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ కానుంది. మహాభారతం లోని యుద్ధ పర్వం నేపథ్యంలో కురుక్షేత్ర మూవీ రూపొందింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో 200రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న కురుక్షేత్ర మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

శరత్ కుమార్ 'నానా' ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనితో సలీమ్ అనే సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నిర్మల్ కుమార్. ఇప్పుడు సీనియర్ హీరో శరత్ కుమార్, శశి కుమార్ ప్రధాన పాత్రల్లో నానా అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Anjali To Make Interesting Fantasy Movie, Anjali Fantasy Movie Latest Updates, Anjali Latest movie News, Anjali next a fantasy film, Heroine Anjali Busy with Fantasy Movie, Telugu Film Updates, Telugu Filmnagar,
సినిమా వార్తలు

ఫాంటసీ కామెడీ మూవీ లో అంజలి

తెలుగు, తమిళ భాషల మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి ఒక ఫాంటసీ కామెడీ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొన్నా పురియదు వంటి కామెడీ మూవీ దర్శకుడు కృష్ణన్ జయరాజ్ దర్శకత్వంలో అంజలి, యోగి బాబు, రామర్ ప్రధాన పాత్రలలో ఫాంటసీ కామెడీ మూవీ రూపొందనుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, వత్తి కుచ్చి వంటి మూవీస్ లో అంజలి కామెడీ క్యారెక్టర్స్ లో నటించినా, ఈ మూవీ లో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ లో నటిస్తారని, అంజలి బాస్కెట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నారని, క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని, సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని, మూడు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశామని దర్శకుడు కృష్ణన్ తెలిపారు.

Team TFNవాట్సాప్

షేర్