మ్యూజిక‌ల్ సెన్సేష‌న్‌ ‘RX 100’కి ఏడాది

2019 Latest Telugu Movie News, RX100 Completes 1 Year, 1 Year Completed karthikeya RX100, RX100 Telugu Movie, Actor karthikeya Latest Movie News, karthikeya RX100 Completes 1 Year Today, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, 1 Year For RX 100
RX100 Completes 1 Year

చిన్న సినిమాలుగా విడుదలై బాక్సాఫీస్ వ‌ద్ద‌ సంచలనాలు సృష్టించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో ‘RX 100’ ఒకటి. స‌రికొత్త కోణంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం… గ‌త ఏడాది తెలుగునాట సెన్సేష‌న‌ల్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌చింది. అజయ్ భూపతి తొలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా పాయ‌ల్ పాత్ర‌, ఆమె న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. సీనియ‌ర్ న‌టులు రావు రమేష్, రాంకీ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఛైతన్ భరద్వాజ్ సారథ్యంలో రూపొందిన పాటలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా “పిల్లా రా”, “మనసునిపట్టి” పాటలు విశేషాద‌ర‌ణ పొందాయి. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రాన్ని… కన్నడంలో ‘దారి తప్పిద మగ’ పేరుతోనూ, అలాగే మిలన్ లుత్రియా డైరెక్షన్‌లో హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. 2018 జూలై 12న విడుదలై ఘన విజయం సాధించిన ‘RX 100’… నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=KxQs1g7CXV4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =