
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 36


రవితేజకి జోడీగా అదితి రావ్ హైదరీ?

స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కీర్తి సురేష్ చిత్రం

ఒరిజినల్ బ్లాక్ బస్టర్

తుది దశకు చేరుకున్న ‘వెంకీమామ’

‘కేరాఫ్ కంచెర పాలెం’ కు మరో ఘనత

అట్లీ కుమార్ మూవీ ఎవరితో ?

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా పృథ్వీ

తమ్ముడి సినిమాకు అన్న సపోర్ట్
బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్
ఏజెంట్ అప్పుడే మొదలుపెట్టేశాడు

అజయ్ భూపతి, రవితేజ కాంబినేషన్ లో "మహాసముద్రం"

అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్?

‘శతమానం భవతి’ జోడీ... మరోసారి?

వెబ్ సిరీస్‌లో సమంత?

బన్నీ... ముచ్చటగా మూడోసారి

గోపీచంద్ ‘చాణక్య’ మూవీ అప్డేట్
గోపీచంద్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ స్పై ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని సమాచారం. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నాడు.
గుణ 369 బుజ్జి బంగారం సెకండ్ లిరికల్ రిలీజ్
వరుస సినిమాలతో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా " తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది " అనే ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయగా.. శ్రోతలను…

రవితేజకి జోడీగా అదితి రావ్ హైదరీ?
అజయ్ భూపతి... గత ఏడాది ‘ఆర్ ఎక్స్ 100’ వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్‌ని అందుకున్న దర్శకుడు. తొలి చిత్రంతోనే నిర్మాతకు లాభాల పంట పండించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమాని డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన అజయ్... ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం మాఫియా నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని టాక్.

స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కీర్తి సురేష్ చిత్రం
‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్... ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ నరేంద్ర రూపొందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని మహేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో... కుటుంబ బంధాలకూ ప్రత్యేక స్థానముంటుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్, నదియా, నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఒరిజినల్ బ్లాక్ బస్టర్
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. చిన్న బడ్జెట్ తో, అంతా కొత్తవారితో రూపొందిన ASSA మూవీ కథా, కథనం తో ఆకట్టుకుని క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

తుది దశకు చేరుకున్న ‘వెంకీమామ’
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్... చిత్రీకరణ పరంగా తుది దశకు చేరుకుందని సమాచారం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... ఈ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘తమ్ముడు’కి 20 ఏళ్ళు
తెలుగునాట క్రీడా నేపథ్యంలో రూపొందిన పలు చిత్రాలు సందడి చేసాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ ఒకటి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకే వన్నె తెచ్చిన ఈ సినిమాలో పవన్‌కు జంటగా ప్రీతి జింగ్యాని నటించింది. బాలీవుడ్ భామ అదితి గోవిత్రీకర్ మరో నాయికగా నటించగా... అచ్యుత్, భూపేందర్ సింగ్, రాజా కృష్ణమూర్తి, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, చంద్రమోహన్, వర్ష తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.
‘కేరాఫ్ కంచెర పాలెం’ కు మరో ఘనత
టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొన్ని గుర్తుండే సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచెర పాలెం సినిమా కూడా ఒకటి. అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించారు.

ఎస్ వి బి సి చైర్మన్ గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి
రంగం ఏదైనా, విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, సమయం ఏదైనా నచ్చిన విషయాన్ని, నమ్మిన విషయాన్ని నమ్మకంగా వాదిస్తే, పాటిస్తే అందుకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అనటానికి ప్రముఖ సినీ హాస్య నటుడు "30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి"ని తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అట్లీ కుమార్ మూవీ ఎవరితో ?
సూపర్ హిట్ రాజారాణి తమిళ మూవీ తో రైటర్, డైరెక్టర్ గా కోలీవుడ్ కు పరిచయమైన అట్లీ కుమార్ , ఆ మూవీ తరువాత తమిళ సూపర్ స్టార్ విజయ్ తో తెరి, మెర్సల్ మూవీస్ రూపొందించారు. తెరి మూవీ ఘన విజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెర్సల్ మూవీ 260 కోట్లు కలెక్ట్ చేసి హీరో విజయ్ సినీకెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్, 5వ హైయెస్ట్ గ్రాసింగ్ఇండియన్ తమిళ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్, నయనతార జంటగా భారీ బడ్జెట్ తో బిజిల్ మూవీ రూపొందుతుంది. అట్లీ కుమార్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాల్షీట్స్…

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా పృథ్వీ
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక పృథ్వి రాజ్ అటు సినిమాలో చేస్తూనే... మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు. వైసీపీ పార్టీ స్టేట్ ప్రతినిథిగా ఆయన పార్టీ తరుపున అనేక ప్రచారాల్లో పాల్గొని.. పార్టీ విజయంలో తన వంత తాను కృషిచేశాడు. జగన్‌తో పాటు పాద యాత్రలో పాల్గొనటమే కాకుండా పార్టీ తరుపున వివిధ చర్చా వేదికల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియాలో టీడీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చేశారు పృథ్వీ.

తమ్ముడి సినిమాకు అన్న సపోర్ట్
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని, జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయంచేస్తూ తెరకెక్కిన సినిమా 'దొరసాని'. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ తరువాత తమ్ముడి సినిమాపై అన్న తన ట్విట్టర్ ద్వారా స్పందించి పొగడ్తలు కురిపించాడు.
బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన రెండవ మూవీ డియర్ కామ్రేడ్ . శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిత్ర యూనిట్ డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా…
ఏజెంట్ అప్పుడే మొదలుపెట్టేశాడు
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. డిటెక్టివ్ గా అటు హ్యూమర్ తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా తన నటనతో మెప్పించి టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ యాక్టర్ దొరికాడు అన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఓ బేబి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ లో సినిమా 11.05 కోట్ల షేర్స్ ని అందుకొని బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ వారం కూడా ఇలానే కొనసాగితే మంచి లాభాలే దక్కుతాయి. మరి ఈవారం ఓ బేబి సినిమా ఏయే ఏరియాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం..

అజయ్ భూపతి, రవితేజ కాంబినేషన్ లో "మహాసముద్రం"
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన RX 100 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అజయ్ భూపతి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ మహాసముద్రం రూపొందనుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తారు.

అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్?
‘క్రిష్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్. తాజాగా `సూపర్ 30`తో పలకరించిన ఈ టాలెంటెడ్ స్టార్... త్వరలో ఓ రీమేక్ మూవీ చేయబోతున్నాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే... అమితాబ్, హేమమాలిని జంటగా నటించిన ‘సత్తే పే సత్తా’ (1982) ని అదే పేరుతో పర్హా ఖాన్ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మించనున్న ఈ చిత్రంలో బిగ్ బి పాత్రలో హృతిక్ నటించనుండగా... హేమమాలిని పాత్రలో దీపికా పదుకొణేని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ రీమేక్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి…

‘శతమానం భవతి’ జోడీ... మరోసారి?
యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం ‘శతమానం భవతి’. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో శర్వాకి జోడీగా నటించి అలరించింది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. కట్ చేస్తే... మూడేళ్ళ తరువాత అదే సంక్రాంతికి మరో చిత్రంతో పలకరించనుందట ఈ అందాల జంట.

వెబ్ సిరీస్‌లో సమంత?
తాజాగా ‘ఓ బేబీ’తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. ప్రస్తుతం... తమిళ బ్లాక్‌బస్టర్ ‘96’ రీమేక్‌లో హీరోయిన్‌గానూ... ‘మన్మథుడు 2’లో అతిథి పాత్రలోనూ నటిస్తోంది సామ్. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇదిలా ఉంటే... ఇప్పటివరకు సినిమాల్లోనే మురిపించిన ఈ చెన్నై సుందరి... అతి త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో దర్శనమివ్వనుందని సమాచారం. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ నిర్మించనున్న ఈ సిరీస్‌లో సామ్ శక్తిమంతమైన పాత్రలో నటించనుందని తెలిసింది. ప్రస్తుతం ఈ మేరకు కథా చర్చలు కూడా సాగుతున్నాయని అంటున్నారు. ఏదేమైనా... త్వరలోనే సామ్…

బన్నీ... ముచ్చటగా మూడోసారి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పెతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం కూడా తమ సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.