మీరే నా రియల్ కామ్రేడ్

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Calls Suriya as Comrade, Vijay Deverakonda Says Suriya is real Comrade, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda About Dear Comrade Movie, Dear Comrade Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Vijay Deverakonda Calls Suriya as Comrade

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 26 తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజవ్వగా.. నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్ పై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించి… ట్రైలర్ ను చూసి ప్రశంసించాడు. ఇక విజయ్ కూడా సూర్య ట్వీట్ పై స్పందించి.. మీరు ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు… మీరే నా రియల్ కామ్రేడ్.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా గతంలో టాక్సీవాలా లీక్ అయినప్పుడు కూడా సూర్య విజయ్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. నీపై మా ప్రేమ ఉంటుంది. ఎలాంటి బాధ అవసరం లేదు అంటూ టాక్సీ వాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు సూర్య అప్పుడు సపోర్ట్ ఇచ్చారు.

ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది.

[subscribe]

[youtube_video videoid=x_NEfuXTR1c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =