రాజ‌శేఖ‌ర్ ‘అంకుశం’కు 30 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, Rajasekhar Ankusham Completes 30 Years, Rajasekhar Ankusham Successfully Completes 30 Years, 30 Glorified Years For Rajasekhar Ankusham, Rajasekhar Ankusham Telugu Movie, Rajasekhar Latest movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Rajasekhar Ankusham Completes 30 Years

అగ్ర కథానాయకుడు డా.రాజశేఖర్‌కు కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘అంకుశం’ ఒక‌టి. రాజశేఖర్ కెరీర్‌ని కీల‌క మలుపు తిప్పిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో… ఆయ‌న నిజ‌జీవిత భాగ‌స్వామి అయిన‌ జీవిత కథానాయికగా నటించింది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రెడ్డి కీలకపాత్ర పోషించగా… ప్ర‌తినాయ‌కుడిగా రామిరెడ్డి న‌టించాడు. న‌టుడిగా రామిరెడ్డికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంతోనే రాజశేఖర్ టాలీవుడ్ `యాంగ్రీ యంగ్ మ్యాన్‌`గా పేరు తెచ్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స‌త్యం సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ సందర్భోచితంగా సాగే గీతాలే. ముఖ్యంగా “ఇది చెరగని ప్రేమకు శ్రీకారం” అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ చిత్రాన్ని హిందీలో ‘ప్రతిబంద్’ పేరుతో రీమేక్ చేయ‌గా… ఆ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. అలాగే… కన్నడంలో రవిచంద్రన్ హీరోగా ‘అభిమన్యు’ పేరుతో ఈ సినిమాని రీమేక్ చేసారు. ఈ రెండు భాషల్లోనూ రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా… రెండు చోట్లా విజయం సాధించిందీ చిత్రం. అంతేకాదు… హిందీ, క‌న్న‌డ వెర్ష‌న్స్‌లోనూ రామిరెడ్డి న‌టించ‌డం మ‌రో విశేషం. ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ యూనిట్ పతాకంపై ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన `అంకుశం`… 1989 జూలై 13న విడుదలై ఘన విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=ZjLnC6IaZL4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =