మెగా పవర్ స్టార్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో కొత్తగా అకౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పోస్ట్ మాత్రం ఈరోజు పోస్ట్ చేస్తానని రెండు రోజుల క్రితమే ఓ వీడియో ద్వారా తెలిపాడు. దీంతో చెర్రీ అభిమానులు తమ అభిమాన హీరో ఫస్ట్ పోస్ట్ ఏముంటుందబ్బా అని ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇక ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ ను తమ అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లి సురేఖతో కలిసి దిగిన రెండు చిత్రాలను రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు తల్లితో ఉన్న చిత్రాన్ని, ఆపై హీరోగా మారిన తరువాత తల్లితో ఒడిలో సేదదీరుతూ దిగిన చిత్రాన్ని పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట్ అటు అభిమానులకే కాదు నెటిజన్లందరికీ నచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on InstagramSomethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.
ఇన్ని రోజులు చెర్రీ ఫేస్ బుక్ ద్వారా అప్ డేట్స్ ను తెలియజేసేవారు. త్వరలోనే ట్విట్టర్ అకౌంట్ కూడా తెరవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జులై 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
[subscribe]
[youtube_video videoid=UEvo3ZJSMmE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: