అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్‌?

2019 Latest Telugu Movie News, Amithab Bachchan Satte Pe Satta Movie, Deepika Padukone to pair opposite Hrithik Roshan, Hrithik Roshan Satte Pe Satta remake, Hrithik Roshan to Remake Amitabh Bachchan Satte Pe Satta Movie, Satte Pe Satta Remake Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘క్రిష్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ క‌థానాయ‌కుడు హృతిక్ రోషన్. తాజాగా `సూప‌ర్ 30`తో ప‌ల‌క‌రించిన ఈ టాలెంటెడ్ స్టార్‌… త్వ‌ర‌లో ఓ రీమేక్ మూవీ చేయ‌బోతున్నాడని టాక్‌. ఆ వివరాల్లోకి వెళితే… అమితాబ్, హేమమాలిని జంటగా నటించిన ‘సత్తే పే సత్తా’ (1982) ని అదే పేరుతో ప‌ర్హా ఖాన్ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బిగ్ బి పాత్ర‌లో హృతిక్ న‌టించ‌నుండ‌గా… హేమ‌మాలిని పాత్ర‌లో దీపికా ప‌దుకొణేని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. అమితాబ్ చిత్రాల రీమేక్స్‌లో హృతిక్ న‌టించ‌డం ఇది రెండోసారి. గతంలో ‘అగ్నిపథ్’ని రీమేక్ చేసి విజ‌యం అందుకున్నాడు హృతిక్‌. ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు ‘సత్తే పే సత్తా’ రీమేక్‌తోనూ అల‌రిస్తాడేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=5nWJNLqCB8I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.