30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక పృథ్వి రాజ్ అటు సినిమాలో చేస్తూనే… మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు. వైసీపీ పార్టీ స్టేట్ ప్రతినిథిగా ఆయన పార్టీ తరుపున అనేక ప్రచారాల్లో పాల్గొని.. పార్టీ విజయంలో తన వంత తాను కృషిచేశాడు. జగన్తో పాటు పాద యాత్రలో పాల్గొనటమే కాకుండా పార్టీ తరుపున వివిధ చర్చా వేదికల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియాలో టీడీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చేశారు పృథ్వీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తన కష్టానికి ఫలితం దక్కినట్టైంది. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీగా పార్టీకి సేవలు అందించిన పృథ్వీకి ఈ పదవితో పాటు… తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) చైర్మన్గా పృథ్వీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదట ఈ పదవికి ఇండస్ట్రీ నుండి జీవిత, రాజశేఖర్, మోహన్ బాబు పేర్లు వినిపించగా చివరికి పృథ్వీకే ఎస్విబిసి చైర్మన్ పదవి దక్కింది. కాాగా గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్గా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఉండేవారు. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు.
[youtube_video videoid=iPeoos-UFH8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























