Ravi Teja to Act in RX 100 Director Ajay Bhupathi Direction
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన RX 100 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అజయ్ భూపతి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ మహాసముద్రం రూపొందనుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తారు.
ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత మహాసముద్రం మూవీ లో నటిస్తారు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, విక్రమార్కుడు, కిక్, బలుపు, పవర్, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన పెర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన హీరో రవితేజ, మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్
భూపతి కాంబినేషన్ మూవీ మహాసముద్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. మహాసముద్రం మూవీ కి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.