బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్

2019 Latest Telugu Movie News, Dear Comrade Music Festival held in Bangalore,Dear Comrade Music Festival by Vijay Deverakonda, Actor Vijay Deverakonda New Journey, Vijay Deverakonda Latest Movie News, Dear comrade movie promotions, Vijay Deverakonda on about Dear Comrade Movie Promotions, Dear Comrade Music Festival, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Dear Comrade Music Festival held in Bangalore

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన రెండవ మూవీ డియర్ కామ్రేడ్ . శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిత్ర యూనిట్ డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా డియర్ కామ్రేడ్ టీమ్ దేశంలోని వివిధ ప్రాంతాలలో మ్యూజిక్ ఫెస్టివల్ టూర్ ను ప్లాన్ చేసింది. నిన్న (12వ తేదీ )భారీ ప్రేక్షకుల మధ్య డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ బెంగుళూరు లో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బ్లాక్ బస్టర్ మూవీ KGF హీరో యశ్ పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక హీరో యశ్ కు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ స్టేజ్ పైన కనబడటంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=5FUDIGBOU9A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.