ఏజెంట్ అప్పుడే మొదలుపెట్టేశాడు

2019 Latest Telugu Movie News, Naveen Polishetty Bangs Two Big Projects, Two Interesting Projects For Naveen Polishetty, Agent sai srinivasa athreya hero Got two Interesting Projects, Naveen Polishetty Signs For Two Interesting Projects, Naveen Polishetty Latest movie news, Naveen Polishetty upcoming Project Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Naveen Polishetty Bangs Two Big Projects

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. డిటెక్టివ్ గా అటు హ్యూమర్ తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా తన నటనతో మెప్పించి టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ యాక్టర్ దొరికాడు అన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం నవీన్ అప్పుడే రెండో సినిమాను కూడా మొదలుపెట్టేసినట్టు తెలుస్తోంది. పిట్ట గోడ ఫేమ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ సినిమా చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతున్నట్టు సమాచారం. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

దీనితో పాటు వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో నవీన్ మంచి అవకాశాన్ని అందుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. స్వప్న సినిమాస్ నెక్స్ట్ మరో కొత్త దర్శకుడితో చేసే సినిమాలో నవీన్ పోలిశెట్టిని హీరోగా ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి వీటిపై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=iPeoos-UFH8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =