గుణ 369 బుజ్జి బంగారం సెకండ్ లిరికల్ రిలీజ్

Guna 369 2nd Song Bujji Bangaram Song Out Now

వరుస సినిమాలతో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గుణ 369’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ” తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది ” అనే ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయగా.. శ్రోతలను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి రెండో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బుజ్జి బంగారం అనే లిరికల్ పాటను రిలీజ్ చేశారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ ఈ సాంగ్ ను లాంచ్ చేశారు. “కలలో కూడా కష్టం కదే ఈ హాయి .. కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి .. వదలకుండా పట్టుకుంటా నీ చేయి .. నువ్వు అట్టా నచ్చేశావోయ్ అబ్బాయి” అంటూ ఈ పాట సాగుతోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. నకష్ అజీజ్ – దీప్తి పార్థసారధి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.

కాగా ఈసినిమాలో కార్తికేయ పక్కన మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ గా నటిస్తుండగా.. సాయి కుమార్, ఆదిత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా కార్తికేయ నటిస్తున్నాడు. ఈసినిమా ఆగష్ట్ లో రిలీజ్ కానుంది. మొత్తానికి నెలకో సినిమా తీస్తూ కార్తికేయ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వీటిలో ఎన్ని సక్సెస్ అందిస్తాయో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=XNxJRwUdaG8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 12 =