
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 158


మంగళవారంకు సాలిడ్ టీఆర్పీ

నాని ..సాలిడ్ లైనప్

రెండు పార్ట్ లుగా హరిహర వీరమల్లు


పవన్ పై ఓజీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఓం భీమ్ బుష్ టీజర్ రిలీజ్

ఆపరేషన్ వాలెంటైన్ బజ్ పెరిగింది

ఆర్టికల్ 370 కలెక్షన్స్

భైరవకోన 10డేస్ కలెక్షన్స్

సుందరం మాస్టర్ 3 డేస్ కలెక్షన్స్

గామి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కల్కి 2898 ఏడీ టైటిల్ పెట్టడానికి అదే కారణం

మైత్రీ చేతికి ఆపరేషన్ వాలెంటైన్ నైజాం హక్కులు

నా ఫేవరెట్ డైరెక్టర్ అయనే
కె.జియఫ్ సిరీస్ తో సినిమాతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. సీజ్ ఫైర్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి భాగమైన సలార్.సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ సలార్.శౌర్యాంగ పర్వం తో బిజీగా ఉన్నాడు…

మంగళవారంకు సాలిడ్ టీఆర్పీ
ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మంగళవారం టీవీల్లో కూడా అదరగొట్టింది.గత ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమాను ఈనెల 11న స్టార్ మా మొదటి సారి టెలికాస్ట్ చేయగా ఏకంగా ఈసినిమా 8.3 టీఆర్పీని రాబట్టింది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకున్నా ఈరేంజ్ లో రేటింగ్స్ రాబట్టడం గొప్ప విషయమే.

నాని ..సాలిడ్ లైనప్
ప్రభాస్ ,రవితేజ లాగా ఏడాదికి మినిమమ్ రెండు సినిమాలు చేసేలా చూసుకుంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని.గత ఏడాది దసరా,హాయ్ నాన్నతో రాగ ఈరెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.ప్రస్తుతం ఈహీరో, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం చేస్తున్నాడు.మూడు రోజుల క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.శనివారం మాత్రమే కోపాన్ని చూపెట్టే సూర్య పాత్రలో నాని కనిపించనున్నాడు.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈసినిమా ఆగస్టు 29న తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదలకానుంది.

రెండు పార్ట్ లుగా హరిహర వీరమల్లు
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే చాలావరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కొంచం పెండింగ్ లో ఉంది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటించాడు. ఇక ఈసినిమా ఫిబ్రవరి2వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఎప్పటిలాగే సుహాస్ తన నటనతో మెప్పించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

పాకిస్థాన్, చైనాలతో ఇండియా వార్స్ గురించి అద్భుతంగా చెప్పిన నాగబాబు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సినిమా చూశాక ప్రతి ఒక్క భారతీయుడు మన జవాన్లకు సెల్యూట్ కొడతారు - వరుణ్ తేజ్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ పై ఓజీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటివరకూ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చారు. అయితే పవన్ గత కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఓం భీమ్ బుష్ టీజర్ రిలీజ్
ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో అలరించడానికి ప్రయత్నించే శ్రీవిష్ణు ఇప్పుడు మరోసారి అదే ప్రయోగంతో వస్తున్నాడ. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈసినిమా ఓం భీమ్ బుష్. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఈసినిమాలో ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.

హాలీవుడ్ మూవీ టాప్‌గన్ స్థాయిలో.. ఆపరేషన్ వాలెంటైన్ - మెగాస్టార్ చిరంజీవి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ మెగాస్టార్…

ఆపరేషన్ వాలెంటైన్ బజ్ పెరిగింది
రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో మెగా హీరో వరుణ్ తేజ్ ఒకరు.ఈసారి ఈహీరో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడు అదే ఆపరేషన్ వాలెంటైన్.మరో నాలుగు రోజుల్లో విడుదలకానుంది.లాస్ట్ మూవీ అంతగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఈసినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు వరుణ్.

మాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఆ మూడు సినిమాలు
సినిమాలకు ఇది సరైన సీజన్ కాకపోవడంతో మిగితా ఇండస్ట్రీ లు కొంచెం డల్ అవ్వగా మాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ తో కళకళలాడిపోతుంది.రీసెంట్ గా రిలీజైనా మూడు మలయాళీ సినిమాలు అక్కడ భారీ వసూళ్లను కురిపిస్తున్నాయి.ఈమూడు కలిపి నిన్నటి వరకు 150కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి.ఇంతకీ ఈమూడు సినిమాలు ఏంటంటే..ప్రేమలు ,భ్రమయుగం ,మంజుమెల్ బాయ్స్.

ఆర్టికల్ 370 కలెక్షన్స్
హిందీలో ఆర్టికల్ 370 అదరగొడుతుంది.గత శుక్రవారం రిలీజైన ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ తోపాటు టాక్ కూడా బాగుండడంతో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 34.71కోట్ల వసూళ్లను రాబట్టింది.ఇక దేశ వ్యాప్తంగా 25.45కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.మొదటి రోజు 6.12కోట్ల రాబట్టగా ఆ తరువాతి రెండు రోజులు అంతకంటే ఎక్కువ రాబట్టింది.శనివారం 9.08కోట్లు,ఆదివారం10.25కోట్లు ఖాతాలో వేసుకుంది.ఇప్పుడప్పుడే పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం కూడా ఆర్టికల్ 370కి అడ్వాంటేజ్ కానుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

భైరవకోన 10డేస్ కలెక్షన్స్
చాలా రోజుల తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు.రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన అనే ఫాంటసీ థ్రిల్లర్ తో వచ్చిన సందీప్ కు ఈసినిమా మంచి విజయాన్ని అందించింది.రివ్యూస్ తోపాటు టాక్ బాగుండడంతో 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25.11కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 14కోట్లు. కేవలం 12కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో బ్రేక్ ఈవెన్ ను దాటి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.డల్ సీజన్ నడుస్తున్న డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ హిట్ అనిపించుకుంది ఈసినిమా.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ధనుష్ 'రాయన్' లో అపర్ణ బాలమురళి ఫస్ట్ లుక్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాయన్'. కాగా ధనుష్ కెరీర్‌లో ఇది 50వ సినిమా కావడం విశేషం. అయితే మరో విశేషమేంటంటే..? ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. అంతకుముందు 2017లో వచ్చిన 'పా పాండి' అనే సినిమాతో ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆయనకు ఉత్తమ దర్శకుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాయన్ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. మంచి అప్లాజ్ వచ్చింది.

సుందరం మాస్టర్ 3 డేస్ కలెక్షన్స్
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష.. ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా మారాడు. ఇప్పుడు హీరోగా మారి తన అదృష్టాన్నిపరీక్షించుకోవడానికి వచ్చాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది. ఈసినిమా చిన్నగా కలెక్షన్స్ ను పెంచుకుంటుంది. మొదటి రోజు ఈసినిమా 2 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా…

గామి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గతఏడాది ధమ్కీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఈసారి మాత్రం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా గామి సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. వాటిలో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా గామి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క్ ప్రమోషన్స్ తో బీజీగా ఉంది చిత్రయూనిట్.

కల్కి 2898 ఏడీ టైటిల్ పెట్టడానికి అదే కారణం
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

అల్లు అర్జున్ తనయుడిపై షారుఖ్ సూపర్ ట్వీట్
బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘డంకీ’. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాప్సి పన్ను కథానాయికగా నటించగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ గతేడాది హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. అంతకుముందు 'పఠాన్', 'జవాన్' సినిమాలు ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు నెలకొల్పాయి. వీటి తర్వాత వచ్చిన ‘డంకీ’ చిత్రం ఈ స్థాయిలో కాకపోయినా, బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇక ఈ మూవీలోని 'లుట్ పుట్ గయా' అనే పాట సూపర్ హిట్టయింది. నెట్టింట దీనిపై అనేక రీల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మైత్రీ చేతికి ఆపరేషన్ వాలెంటైన్ నైజాం హక్కులు
ఈమధ్య నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈమధ్య కాలంలో సలార్, హనుమాన్ సినిమాల నైజాం హక్కులను సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేయగా ఆ సినిమా ఎంత లాభాలు తెచ్చిపెట్టాయో చూశాం.