పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటివరకూ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చారు. అయితే పవన్ గత కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న నటులు పవన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ కూడా పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఓజి మూవీ చాలా బాగా వస్తుంది.. మీరందరూ కూడా ఆ మ్యాజిక్ ను స్క్రీన్ పై చూసేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ పవన్ ఒక లెజెండ్, చాలా మంచి మనిషి, గ్రేట్ లీడర్ అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: