రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో మెగా హీరో వరుణ్ తేజ్ ఒకరు.ఈసారి ఈహీరో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడు అదే ఆపరేషన్ వాలెంటైన్.మరో నాలుగు రోజుల్లో విడుదలకానుంది.లాస్ట్ మూవీ అంతగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఈసినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు వరుణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ తో ఈసినిమాకు హైప్ వచ్చింది.దాంతో నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమా రిలీజ్ రైట్స్ ను తీసుకుంది.నిన్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగడం దానికి ముఖ్య అతిథిగా చిరంజీవి రావడం తో ప్రమోషన్స్ పరంగా బాగానే కలిసొచ్చింది.ఆంధ్రా లోకూడా బిజినెస్ పూర్తయింది.మొత్తానికి అయితే బజ్ బాగానే వుంది. మరి ఈసినిమా వరుణ్ తేజ్ కు కావాల్సిన విజయాన్ని అందిస్తుందో చూడాలి.
బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించగా నవదీప్,రుహాణి శర్మ కీలక పాత్రలు పోషించారు.మిక్కి జె మేయర్ సంగీతం అందించాడు.సోనీ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.తెలుగుతోపాటు హిందీలో ఈసినిమా మార్చి 1న విడుదలకానుంది.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్,మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు.పలాస ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























