ఆర్టికల్ 370 కలెక్షన్స్ 

Article 370 three days collections

హిందీలో ఆర్టికల్ 370 అదరగొడుతుంది.గత శుక్రవారం రిలీజైన ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ తోపాటు టాక్ కూడా బాగుండడంతో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 34.71కోట్ల వసూళ్లను రాబట్టింది.ఇక దేశ వ్యాప్తంగా 25.45కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.మొదటి రోజు 6.12కోట్ల రాబట్టగా ఆ తరువాతి రెండు రోజులు అంతకంటే ఎక్కువ రాబట్టింది.శనివారం 9.08కోట్లు,ఆదివారం10.25కోట్లు ఖాతాలో వేసుకుంది.ఇప్పుడప్పుడే పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం కూడా ఆర్టికల్ 370కి అడ్వాంటేజ్ కానుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్టికల్ 370 రద్దును బేస్ చేసుకొని తెరకెక్కిన ఈసినిమాలో యామి గౌతమ్ ,ప్రియమణి,అరుణ్ గోవిల్ లీడ్ రోల్స్ లో నటించగా నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య సుహాస్ డైరెక్ట్ చేశాడు.ఆదిత్య ధార్ ,లోకేష్ ధార్ ఈసినిమాను నిర్మించారు.ఇందులో యామి గౌతమ్ ,ప్రియమణి నటన  హైలైట్ అయ్యాయి.వీటితో పాటు డైరెక్టర్ ఆదిత్య సుహాస్ రైటింగ్, డైరెక్షన్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =