ప్రభాస్ ,రవితేజ లాగా ఏడాదికి మినిమమ్ రెండు సినిమాలు చేసేలా చూసుకుంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని.గత ఏడాది దసరా,హాయ్ నాన్నతో రాగ ఈరెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.ప్రస్తుతం ఈహీరో, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం చేస్తున్నాడు.మూడు రోజుల క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.శనివారం మాత్రమే కోపాన్ని చూపెట్టే సూర్య పాత్రలో నాని కనిపించనున్నాడు.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈసినిమా ఆగస్టు 29న తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తరువాత నాని మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో భాగంగా నాని తన 32వ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తో చేయనున్నాడు.అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించనుంది.ఈసినిమా తరువాత నాని, బలగం ఫేమ్ వేణు యెల్దండి తో సినిమా చేయనున్నాడు.ఈసినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ప్రచారం లో వుంది.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామా గా రానుందట.ఈసినిమాకు నాని ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్లే కానీ ఇంకా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ వినాల్సివుంది.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నాడు.
దీనితో పాటు దసరాతో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను కథ రెడీ చేసుకోమని చెప్పాడట నాని.వీరి కాంబినేషన్ లో రెండో సినిమా దాదాపు ఫిక్స్ అయ్యినట్లే.దసరాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈసినిమాను కూడా నిర్మించే ఛాన్స్ వుంది.అలా మొత్తానికి వరస సినిమాలతో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు నాని.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: