మంగళవారంకు సాలిడ్ టీఆర్పీ 

Mangalavaaram Telivision Premiere Gets Solid TRP Rating

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మంగళవారం టీవీల్లో కూడా అదరగొట్టింది.గత ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమాను ఈనెల 11న స్టార్ మా మొదటి సారి టెలికాస్ట్ చేయగా ఏకంగా ఈసినిమా 8.3 టీఆర్పీని రాబట్టింది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకున్నా ఈరేంజ్ లో రేటింగ్స్ రాబట్టడం గొప్ప విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన మంగళవారంలో చివరి 40నిమిషాలను హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.ట్విస్టులను రివీల్ చేసిన తీరు  మెప్పిస్తుంది.పాయల్ రాజ్ పుత్ ఈసినిమాలో మెయిన్ లీడ్ గా నటించగా ప్రియదర్శి,చైతన్య కృష్ణ,అజయ్ గోష్ కీలక పాత్రల్లో నటించారు.అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.ముద్రా మీడియా వర్క్స్ ,ఏ క్రియేటివ్ వర్క్స్ ఈసినిమాను నిర్మించాయి.

ఇక ఈసినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా రానుంది.ఫస్ట్ పార్ట్ విడుదల సందర్భంగానే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు అజయ్ భూపతి.మరి వెంటనే సీక్వెల్ మొదలు పెడతాడో లేదా మరో సినిమా చేసి మంగళవారం 2ను స్టార్ట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =